Operation Prasanth Varma Tollywood.. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే, నిర్దాక్షిణ్యంగా వీరె.. అంటాడు మహాకవి శ్రీశ్రీ.!
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు.? అసలేంటీ ఆపరేషన్ ప్రశాంత్ వర్మ.? ఓ కుర్రాడు, సినీ రంగంలోకి సంచలనంలా దూసుకొచ్చాడు.
దేశం దృష్టిని ఆకర్షించాడు. ఓ చిన్న హీరోని సూపర్ హీరోగా చూపించి, అత్యద్భుత విజయాన్ని నమోదు చేశాడు. జాతీయ స్థాయిలో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు.
ప్రశాంత్ వర్మ.. దర్శకుడు, నిర్మాత కూడా.! ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ.. అంటూ, పెద్ద పెద్ద పద ప్రయోగాలూ తెరపైకొచ్చాయి.
ప్రముఖ హీరోల నుంచి ప్రశాంత్ వర్మకి సినిమాలొచ్చాయి. నిర్మాతలు, అతనితో సినిమాలు చేయడానికి క్యూ కట్టారు. అడ్వాన్సులూ ఇచ్చారు.
Operation Prasanth Varma Tollywood.. తప్పెవరిది.?
ఎడా పెడా సినిమాల ప్రకటనలు కూడా జరిగిపోయాయి. ఓ ప్రముఖ హీరో, తన కుమారుడి సినిమాని ప్రశాంత్ వర్మతో లాంఛ్ చేయాలనుకున్నాడు.
కానీ, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమవుతోంది. అది ఆగిపోయిందన్న ప్రచారమూ లేకపోలేదు. ఇంకో స్టార్ హీరో సినిమా పట్టాలెక్కాల్సి వుంది.
చెప్పుకోవాలంటే లిస్టు పెద్దదే.! ప్రశాంత్ వర్మ తోపు, తురుము.. అంటూ, కొనియాడిన మీడియా, ఇప్పుడు సడెన్‌గా ప్లేటు ఫిరాయించేసింది.
ప్రశాంత్ వర్మ, నిర్మాతల్ని ముంచేశాడంటూ తెలుగు సినీ మీడియాలో ఓ వర్గం, పుంఖాను పుంఖాలుగా కథనాల్ని వండి వడ్డిస్తోంది.
తొలుత లీకులు, ఆ తర్వాత గాసిప్పులు.. ఈ క్రమంలో విషయం, ఛాంబర్ వరకూ వెళ్ళింది. అక్కడ వ్యవహారం పెద్దల పరిశీలనలో వుంది. మళ్ళీ, యధాతథంగా లీకులు, గాసిప్పులు.
చెత్త పాత్రికేయం.. పనికిమాలిన విశ్లేషణ..
ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చాడు. అబ్బే, ఆ వివరణ సరిపోదంటూ, మీడియాలోనే పెదవి విరుపులు.! టీజర్‌కి ఇన్ని కోట్లు, ట్రైలర్‌కి ఇన్ని కోట్లు.. అని చెప్పి, ప్రశాంత్ వర్మ లూటీ చేశాడన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి.
అయినా, అంతలా నిర్మాతలు ఎలా గుడ్డిగా డబ్బులు ఇచ్చినట్లు.? ఇదింతే.. ఇది సినీ మాయ.! సక్సెస్ వైపు, ఎగేసుకుంటూ వెళతారు. ఫెయిల్యూర్ వస్తే, పెదవి విరుస్తారు.
ఇదేమీ కొత్త కాదు. ఓ హీరోకి, వంద కోట్లు ఎందుకు ఇవ్వాలి.? ఎందుకంటే, అతని స్టార్‌డమ్. అస్సలేమాత్రం నటన రాని హీరోయిన్‌కి ఐదు కోట్లు.. ఆపైన ఎందుకు ఇస్తారు.? పాపులారిటీ.
మరి, ప్రశాంత్ వర్మ విషయంలో కూడా అదే కదా జరిగింది.? ప్రశాంత్ వర్మని ఎందుకు టార్గెట్ చేసినట్లు.? మీడియాలోనే ఎందుకింత రచ్చ జరుగుతోంది.?
Also Read; బుర్రలు బద్దలాసుపోయే ప్రశ్న: అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత.?
బ్లాక్‌మెయిల్ జర్నలిజానికి అలవాటుపడిపోయింది సినీ మీడియాలోని ఓ వర్గం. ఓ సినిమా గురించి జస్ట్ వార్తలు రాయడానికి, ఐదు లక్షలు ఆ పైన ప్యాకేజ్ తీసుకుంటోంది ఓ వెబ్ సైట్.
మొన్నీమధ్యనే ఓ నిర్మాత, ఈ వివరాల్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రశాంత్ వర్మ విషయంలో పత్తిత్తు నీతులు చెబుతున్న మీడియా, సినిమా వార్తలు రాయడానికి లక్షల్లో ఎందుకు ప్యాకేజీలు డిమాండ్ చేస్తున్నట్లు.?
ఓ బూతు ప్రశ్న సంధించడానికి, కాటికి కాలు చాపుకున్న ఓ సినీ ఎర్నలిస్ట్ బొక్కేది పది వేల నుంచి పాతిక వేల దాకా.!
ఆ దిక్కుమాలిన ముసలి జర్నలిస్ట్, ప్రశాంత్ వర్మ గురించి అవాకులు చవాకులు పేలడం.. అదీ, జర్నలిజం ముసుగులో.!
ప్రశాంత్ వర్మ చేసింది తప్పయితే, అతని స్టార్‌డమ్‌ని క్యాష్ చేసుకోవడానికి, కక్కుర్తి పడ్డ నిర్మాతలది అంతకన్నా పెద్ద తప్పు.! అంతేనా.? కాదా.?
