Table of Contents
Pahalgam INS Vikrant.. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండూ అణ్వస్త్రాల్ని కలిగి వున్న దేశాలే.!
అయితే, మొదటగా మేం దాడి చేయం.. అని భారత దేశం స్వీయ నియంత్రణ పాటిస్తోంది దశాబ్దాలుగా. కానీ, పాకిస్తాన్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతూనే వుంది.
సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పాకిస్తాన్‌కి వెన్నుతో పెట్టిన విద్య. ఆ తీవ్రవాదానికి దశాబ్దాలుగా లెక్కలేనంతమంది భారత పౌరులు, భారత సైనికులు బలైపోయారు.
ఇంకెన్నాళ్ళిలా.? అన్న చర్చ ప్రతిసారీ జరుగుతోంది. గతంలో పుల్వామా దాడి సమయంలోనూ ఇదే చర్చ జరిగింది.
సర్జికల్ స్ట్రైక్స్ చేసినా, ఇంకోటి చేసినా.. అవన్నీ తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే.
Pahalgam INS Vikrant.. పూర్తి స్థాయి యుద్ధం సాధ్యమేనా.?
పూర్తిస్థాయి యుద్ధం.. అనే మాట అనడానికి బాగానే వుంటుంది గానీ, అది ఎవరికీ మంచిది కాదు. మరీ ముఖ్యంగా, భారత దేశానికి. ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధాన్ని చూస్తున్నాం కదా.!
అదే, ఆ ఒక్క పాయింట్ దగ్గరే భారత దేశం కాస్త వెనకడుగు వేస్తోంది. కాదు కాదు, వ్యూహాత్మక సంయమనం పాటిస్తోంది.

ఇక తప్పదు, ప్రతిసారీ, అలాగే సంయమనం పాటిస్తోంటే, శతృవు సృష్టిస్తోన్న మారణ హోమానికి హద్దూ అదుపూ లేకుండా పోతోందన్న ఆవేదన సగటు భారత పౌరుడిలో కలుగుతోంది.
ఈసారి మరింత దారుణమైన పరిస్థితి. టూరిస్టుల్ని, అందులో మగవాళ్ళని ఎంచుకుని, మతం అడిగి మరీ మారణ హోమం సృష్టించారు పహల్గామ్‌లో టెర్రరిస్టులు.
అదీ.. ఇదీ.. రెండూ అవసరమే..
దాంతో, ధీటుగా సమాధానమివ్వాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.
ఓ వైపు, వ్యూహాత్మకంగా పాక్‌ని చావు దెబ్బ తీస్తూనే, ఇంకో వైపు, ఆయుధాలతోనూ పాకిస్తాన్‌కి తగిన శాస్తి చేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
సముద్ర జలాల్లోకి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు.. వెళుతున్నాయి. పెద్దన్న ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక యుద్ధ నౌక కూడా రంగంలోకి దిగినట్లు వార్తలొస్తున్నాయి.

విక్రాంత్ గనుక రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్.. అన్నది నిర్వివాదాంశం. వాయు సేన నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలూ సర్వసన్నద్ధంగా వున్నాయి.
అత్యాధునిక క్షిపణుల్ని సరిహద్దుల్లో మోహరిస్తోంది భారత ఆర్మీ. ఎలా చూసుకున్నా, ఈసారి యుద్ధం తప్పేలా కనిపించడంలేదు.
యుద్ధం మిగిల్చే నష్టమెంత.?
భారత ఆయుధ సంపత్తితో పోల్చితే, పాకిస్తాన్ మీద యుద్ధంలో గెలుపు, నల్లేరు మీద నడకే.
కానీ, ముందే చెప్పుకున్నట్లు, యుద్ధం మిగిల్చే నష్టం అంతా ఇంతా కాదు. ఆ ఒక్క విషయం దగ్గరే కాస్త ఆగి, వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి వస్తోంది భారత దేశం.
Also Read: ఒప్పుకున్నది నాని కోసమే.! ‘హిట్టు’ కొడతావా మరి.?
పాకిస్తాన్‌పై నేరుగా దాడి చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. బదులుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు నడుం బిగిస్తే, సరిపోతుందేమో.
అదే జరిగితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి భారత దేశంలో కలుస్తుంది. ఆ తర్వాత, పాకిస్తాన్ పీడ, భారత దేశానికి శాశ్వతంగా విరగడైనట్లే. అలానే జరుగుతుందని ఆశిద్దాం.