Pakka Commercial Review.. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఇంతకీ హిట్టా.? ఫట్టా.? అసలేంటి కథ.?
మారుతి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలకు పబ్లిసిటీ ఒకింత ప్రత్యేకంగా జరుగుతుంటుంది. ఈ సినిమాకీ పబ్లిసిటీ బీభత్సంగానే చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. తన కోసం కథ సిద్ధం చేయమని దర్శకుడు మారుతిని కోరారు చిరంజీవి.
అంతేనా, గోపీచంద్ తండ్రి టి.కృష్ణతో తనకున్న అనుబంధాన్నీ చాటుకున్నారు మెగాస్టార్.
Pakka Commercial Review.. ‘పక్కా కమర్షియల్’ పరిస్థితేంటి.?
ఇవన్నీ పక్కన పెడితే, సినిమా ఎలా వుంది.? అది కూడా చాలామందికి అనవసరం. నిన్న సాయంత్రం నుంచే ‘పక్కా కమర్షియల్’ పక్కా ఫెయిల్యూర్.. అనే రచ్చ షురూ అయ్యింది.
‘గోపీచంద్ సినిమాక్కూడానా.?’ అంటూ నెటిజనం ముక్కున వేలేసుకున్నారు. ఈ మధ్య ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, ముందుగానే ‘డిజాస్టర్’ అనే టాక్ షురూ అవుతోంది.

చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. ఈ పైత్యానికి బలవ్వాల్సిందే. నిజానికి, తెలుగు సినీ పరిశ్రమలో హీరోల మధ్య చాలా సఖ్యతతో కూడిన వాతావరణం వుంది. తోటి హీరోల సినిమాల్ని దాదాపు అందరు హీరోలూ కొనియాడుతున్నారు.
ఓటీటీలో చూసుకోవాల్సిందే..
అయినాగానీ, సోషల్ మీడియాలో ఇలా ఎందుకు జరుగుతోంది.? ఏ హీరోల అభిమానులు ఇలాంటి నెగెటివిటీలో కొట్టుమిట్టాడుతున్నారు.? అంటే, అందరూ.. అని చెప్పక తప్పదు.
నిజానికి, ఇక్కడ హీరోల తప్పిదం ఏమీ లేదు. హీరోల అభిమానులదే తప్పంతా. అందునా, కొందరు దురభిమానులతోనే వస్తోంది ఈ సమస్య.
సినిమాలో కంటెంట్ వుంటే, వర్కవుట్ అవుతుంది.. లేదంటే, థియేటర్లలో నుంచి తొందరగానే ఔట్ అయిపోతుంది. అది వేరే సంగతి.
Also Read: పవన్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ పై హరీష్‌కి కొత్త కష్టం.?
కానీ, ఈ నెగెటివిటీ పుణ్యమా అని, ఓ మోస్తరు సినిమా కూడా దారుణంగా దెబ్బతినేసే అవకాశాలుంటాయి.
అసలే, థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమైపోయింది. ఈ సోషల్ నెగెటివిటీ ఇలాగే కొనసాగితే, ఇకపై సినిమాలు పూర్తిగా ఓటీటీలో చూసుకోవాల్సిందే.
ఆ తర్వాత సినిమాలు పూర్తిగా మాయమైపోయి, ఓటీటీ కంటెంట్‌తో, టీవీ సీరియళ్ళతో సరిపెట్టుకోవాల్సిందేనేమో.!