Table of Contents
Pathaan.. ఇంతకీ, ఈ పాటలో దీపికా పడుకొనే ఏం చేసిందబ్బా.? ఓహో, డాన్స్ చేసిందేమో.! అలా అనుకుని సంతృప్తి చెందాల్సిందేనేమో.!
తెలుగు మార్కెట్ మీద కన్నేసిన బాలీవుడ్, ఏదో మొహమాటానికి.. అన్నట్టు తెలుగులోనూ రిలీజ్ చేస్తోంది. ఔను మరి, డైలాగ్స్.. పాటలు.. వీటిల్లో తెలుగు నేటివిటీ గురించి అస్సలు ఆలోచించట్లేదు.
ఆ లిరిక్స్ ఏంటి మహాప్రభో.? అని విన్నవాళ్ళంతా గింజుకోవాల్సి వస్తోంది. ‘Besharam Rang’ హిందీ సాంగ్. తెలుగులో దాన్ని ‘నా నిజం రంగు’ అని మార్చారు.
సౌత్కీ బాలీవుడ్‌కీ అదే తేడా..
‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’.. ఇలా సౌత్ సినిమాలు హిందీలోకి వెళ్ళినప్పుడు, డైలాగ్స్ దగ్గర్నుంచి పాటల వరకు.. అక్కడి నేటివిటీని కూడా అంది పుచ్చుకుంటున్నారు.
అందుకే, హిందీ ఆడియన్స్.. స్ట్రెయిట్ హిందీ సినిమాలకంటే సౌత్ నుంచి వచ్చిన సినిమాల్ని ఎక్కువ ఆదరిస్తున్నారు ఈ మధ్యకాలంలో.
Pathaan షారుక్‌కి ఏమయ్యింది.?
షారుక్ ఖాన్ అంటే ఇండియన్ సూపర్ స్టార్. కానీ, ఇప్పుడు ఆయన తన స్థాయికి తగిన సినిమాలు చేయలేకపోతున్నాడు.
దీపికా పడుకొనే సంగతి సరే సరి.! ఒకప్పుడు మంచి పాత్రల కోసం ప్రయత్నించేది. ఇప్పుడు ‘కక్కుర్తి’ ఎక్కువైపోయినట్లుంది.. అందుకు ఈ పాట ఓ ఉదాహరణ అనుకోవచ్చేమో.!
పాట ఇలా వుంటే.. పఠాన్ ఇంకెలా వుంటాడో.!
పాట మీద బోల్డంత ట్రోలింగ్ జరుగుతోంది. ఈ లెక్కన ‘పఠాన్’ సినిమా ఏమవుతుందో.! బేషరమ్ పఠాన్.. అనే విమర్శలు వస్తున్నాయిప్పుడు షారుక్ మీద.