Table of Contents
Pavitra Lokesh Naresh సినీ నటి పవిత్ర లోకేష్ పేరు నిత్యం మీడియాలో మార్మోగుతోంది. సీనియర్ నటుడు నరేష్, ఆమెతో సహజీవనం చేస్తుండడమే ఇందుకు కారణం. ఈ రోజుల్లో సహజీవనం నేరమేమీ కాదు.
‘ఓసారి స్నేహితురాలంటాడు.. ఇంకోసారి తాను మగాడినని చెబుతుంటాడు.. తనకూ కొన్ని అవసరాలుంటాయి కాబట్టి..’ అంటూ పవిత్ర లోకేష్‌తో ‘కలిసి వుండడం’పై నరేష్ ఏవేవో చెబుతున్నాడు.
‘నాకు, నరేష్‌కీ మీరు అండగా వుండాలి..’ అని పవిత్ర లోకేష్ చెబుతోంది. సో, ఇక్కడ మేటర్ క్లియర్. ఒకరినొకరు అర్థం చేసుకున్నారని.! అయితే, ఇందులో అసలు అర్థం ‘ఆర్థిక, శారీరక అవసరాలు’ అనేది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ.
Pavitra Lokesh Naresh.. ఔను, వాళ్ళిద్దరూ ఇరుక్కున్నారు..
పవిత్ర లోకేష్‌కి పెళ్ళయ్యింది.. పిల్లలున్నారు. ఆగండాగండి.. పెళ్ళి కాదుట, పెళ్ళిళ్ళు అట.! అలాగని, ఆమె భర్తగా చెప్పబడుతున్న సుచేంద్ర అనే వ్యక్తి అంటున్నాడు.
ఇక, నరేష్ భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) సంగతి సరే సరి. నరేష్‌కి చాలామంది మహిళలతో అక్రమ సంబంధాలున్నాయంటోంది. పవిత్ర లోకేష్‌ది కొంపలు కూల్చే బుద్ధి అని విమర్శిస్తోంది.

రివర్స్ ఎటాక్.. అన్నట్టుగా, నరేష్ కూడా తన భార్య రమ్య రఘుపతి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా డ్రైవరుతో తన భార్యకు ‘రంకు’ అంటగట్టేశాడు నరేష్.
సినిమాలో ఛాన్సులు గల్లంతే.!
నరేష్‌కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఆర్థికంగా బాగా స్థిరపడిపోయాడాయన. ‘మగాడు’ కదా, సినిమాల్లో అవకాశాలు వస్తూనే వుంటాయ్.
పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) పరిస్థితేంటి.? ఆమె రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యిందంటున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న కొన్ని సినిమాలు చేజారిపోయాయట.. అదీ ఈ వివాదం కారణంగానే.
అయితే, ఆమె ముందే జాగ్రత్త పడిందనీ.. నరేష్ నుంచి బాగా లాగేసిందనీ.. రమ్య రఘుపతి ఆరోపిస్తుండడం కొసమెరుపు.
తప్పు కాదా.? ఎంత నిజం..
నరేష్‌కి (Actor Naresh) భార్య వుంది.. పవిత్రకి భర్త వున్నట్లుగా చెబుతున్నారు. మరెలా ఈ ఇద్దరూ సహజీవనం చేస్తారు.? చట్ట ప్రకారం నేరమా.? కాదా.? దీనిపై న్యాయ నిపుణుల వాదనల సంగతెలా వున్నా, ఇదైతే అనైతిక బంధమే.!
Also Read: లీనా.! ‘కాళీ’పై వెకిలితనమా.! వాళ్ళపై చెయ్యగలవా.?
ఈ వ్యవహారంలో ‘మోరల్ పోలీసింగ్’ జరుగుతోందన్నది ఓ విమర్శ. కానీ, దానికి ఆస్కారమెక్కడిది.?
‘నా భార్యకి డ్రైవరుతో ఎఫైర్ వుంది..’ అని చెప్పుకునే స్థాయికి నరేష్ దిగజారిపోయాక, తన భర్తకి వున్న అక్రమ సంబంధాల గురించి రమ్య రఘుపతి చెప్పాక.. ఇదొక ‘బరితెగింపు’ స్టోరీ అవకుండా వుంటుందా.?
ఈ దిక్కుమాలిన రచ్చపై జనాల్లో కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ క్రియేట్ అవకుండా వుంటుందా.? ఈ రోజుల్లో రోడ్డున పడి కొట్టుకోవడం.. మీడియాకెక్కి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం.. రెండూ ఒకటే.!