Pavitra Naresh Malli Pelli.. ఏందీ పంచాయితీ.? అసలెందుకీ వల్గారిటీ.? సోషల్ మీడియా వేదికగా కొన్నాళ్ళ క్రితం సీనియర్ నటుడు నరేష్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయితే జరిగిన రచ్చ అది.
కొత్త ఏడాదిలో.. కొత్త కొత్తగా.. అంటూ ఆ వీడియో పోస్ట్ చేశారు నరేష్. అందులో సీనియర్ నటి పవిత్ర లోకేష్, సీనియర్ నటుడు నరేష్.. లిప్ లాక్ సీన్ వుంది.
నిజం పెళ్ళి కాదుట.! సినిమా పెళ్ళి మాత్రమేనట.!
ఆ లిప్ లాక్ వీడియో కూడా అంతే.!
ఆ పెళ్ళి ఫొటోలూ అంతే.!
ఇంతకీ, ఈ ఇద్దరి మధ్యా ప్రేమ సంగతేంటి.?
ఇద్దరూ కలిసే వుంటున్న విషయమేంటి.?
అది వారి వ్యక్తిగతం.! ఇదైతే సినిమా.! మళ్ళీ పెళ్ళి.!
జరగాలి మళ్ళీ మళ్ళీ.. అదేనండీ, సినిమా పెళ్ళి కదా.!
Mudra369
గత కొంతకాలంగా నరేష్, పవిత్ర.. కలిసే వుంటున్నారు. మూడో భార్యతో విడాకుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో, నరేష్ తన నాలుగో పెళ్ళిని వాయిదా వేసుకోక తప్పలేదు.
Pavitra Naresh Malli Pelli.. మళ్ళీ పెళ్ళి.. సినిమాయే..
మొన్నీమధ్యనే నరేష్ – పవిత్రల పెళ్ళికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, అదంతా సినిమా కోసమేనని తేలింది.
ఆ సినిమా పేరు ‘మళ్ళీ మళ్ళీ’. నరేష్ నిర్మాత.. ఎమ్మెస్ రాజు దర్శకుడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తాజాగా విడుదలైంది. సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తారట.

సినిమా ప్రమోషన్స్ కోసమన్నమాట.. ఇప్పటిదాకా పెళ్ళి చుట్టూ జరిగిన హంగామా. ‘రియల్ లైఫ్ కపుల్.. రీల్ లైఫ్ కపుల్‌గా నటిస్తున్నారు’ అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుండడం సహజమే.
Also Read: Das Ka Dhamki FDFS: విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఎవరికి.?
పవిత్ర లోకేష్ పద్ధతిగా ముగ్గు పెడుతోంటే.. నరేష్ తన్మయత్వంతో చూస్తున్న ఫొటోతో కూడిన ‘మళ్ళీ మళ్ళీ’ పోస్టర్ వైరల్ అవుతోంది.
స్టార్ హీరో.. స్టార్ హీరోయిన్ నటించిన సినిమాకి జరిగే స్థాయిలో రచ్చ ఈ ‘మళ్ళీ మళ్ళీ’ సినిమా విషయంలో జరగనుందన్నది నిర్వివాదాంశం.