Pavitra Naresh Supari సీనియర్ నటుడు నరేష్ ఎప్పటికప్పుడు అనూహ్యంగా వార్తల్లో వ్యక్తి అయిపోతున్నాడు.
సినీ నటుడిగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల మాటేమోగానీ, ‘పవిత్ర నరేష్’గా ఎప్పుడైతే మారాడో, ఆ తర్వాత ఆయనకి లభిస్తున్న ‘కవరేజ్’ అంతా ఇంతా కాదు.
నరేష్ తల్లి విజయనిర్మల, సూపర్ స్టార్ కృష్ణని రెండో వివాహం చేసుకున్నా.. ఏనాడూ ఆమె వివాదాల్లోకెక్కలేదు. ఆమె ఆత్మ ఘోషించేలా వుంటోంది పవిత్ర నరేష్ వ్యవహారం.!
Mudra369
నూతన సంవత్సర శుభాకాంక్షల్ని ‘పవిత్ర నరేష్’ పేరుతో చెబుతూ ఓ వీడియోను నరేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Pavitra Naresh Supari పవిత్ర లోకేష్ ఎంట్రీతో మారిన సీన్..
సీనియర్ నటి పవిత్ర, సీనియర్ నటుడు నరేష్.. ఈ ఇద్దరూ ఇప్పుడు ‘సహజీవనం’ చేస్తున్నారు. లేటు వయసులో ఈ ఘాటు ప్రేమ ఏంటి.? అంటే, దానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.

లిప్ లాక్ వీడియో ఒకటి కొత్త సంవత్సర ‘కానుకగా’ విడుదల చేసి, పవిత్ర నరేష్ కొత్త రచ్చకు తెరలేపారు.
మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రతో నరేష్ పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధమవుతున్నాడన్న ప్రచారంతో వివాదం ముదిరి పాకాన పడింది.
చంపేందుకు కుట్ర.!
ఇది మరీ టూమచ్.! ఏకంగా సుపారీ ఇచ్చి మరీ తనను చంపేందుకు తన భార్య రమ్య ప్రయత్నిస్తోందన్నది నరేష్ తాజా ఆరోపణ.
రమ్య క్యారెక్టర్ మీద నరేష్ మీడియా సాక్షిగా వేస్తున్న నిందలు అన్నీ ఇన్నీ కావు. నరేష్ మీద రమ్య కూడా అంతకు మించిన స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: కీర్తి సురేష్ పెళ్లంట.! విడాకులు కూడానంట.!
విడాకుల కోసం పెద్ద మొత్తంలో డబ్బుని రమ్య డిమాండ్ చేస్తోందన్నది నరేష్ తాజా ఆరోపణ. తన హత్యకు కుట్ర పన్నిందంటూ ఆమెపై పోలీసులకు నరేష్ ఫిర్యాదు కూడా చేశాడట.
ఈ వివాదం ఎక్కడిగాకా వెళుతుందోగానీ, ‘పవిత్ర నరేష్’ ఉదంతం, జనానికి బోల్డంత ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. సినిమాల్లో కూడా ఇలాంటి ట్విస్టుల్ని ఊహించలేం మరి.!