Pawan Jagan Political Alliance.. ఓ వైపు సోషల్ మీడియా వేదికగా జనసేన – వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇంకోపక్క, ‘పవన్ కళ్యాణ్‌తో వైఎస్ జగన్ డీల్ సెట్ చేసుకుంటే మంచిది..’ అన్న చర్చ మొదలైంది. అసలు, ఈ కాంబినేషన్ సాధ్యమయ్యేదేనా.?
రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు.. ఎవరూ వుండరు. జనసేన – వైసీపీ మధ్య పొత్తు కోసం అప్పట్లో వైసీపీ నుంచే ప్రయత్నాలు జరిగాయి.
ఇదే విషయాన్ని ఒకప్పుడు వైసీపీలో కీలక నేతగా వున్న విజయ సాయి రెడ్డి, తాను వైసీపీలో వున్నప్పుడే చెప్పారు. వైసీపీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిథులు కూడా అప్పట్లో ఇదే మాట చెప్పారు.
Pawan Jagan Political Alliance.. పొత్తుల సమీకరణాలు మారతాయా.?
కానీ, 2014 ఎన్నికల్లోనూ, 2024 ఎన్నికల్లోనూ టీడీపీతోనే కలిసింది జనసేన. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. 2029లో టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి అధికార పీఠమెక్కాయి.
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ.. విడివిడిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. మరి, 2029 ఎన్నికల్లో ఏం జరగబోతోంది.?
జనసేన – టీడీపీ.. ఈ రెండు పార్టీల అగ్రనాయకత్వాలూ ఖచ్చితమైన అవగాహనతో వున్నాయి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఇరు పార్టీల అధినేతలూ జాగ్రత్త పడుతున్నారు.
పదిహేనేళ్ళపాటు కూటమి బలంగా వుండాలనీ, అప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే భావనలో వున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
కూటమిలో చిన్న చిన్న అభిప్రాయ బేధాలేమైనా వుంటే, తక్షణమే ఆయా సమస్యల్ని పరిష్కరించుకుంటున్నామని చంద్రబాబూ చెబుతున్నారు.
కానీ, కింది స్థాయిలో కార్యకర్తల వ్యవహారం వేరేలా వుంది. టీడీపీ – జనసేన క్యాడర్ మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు చూస్తూనే వున్నాం. సోషల్ మీడియాలో అయితే, ఈ రచ్చ మరీ దారుణంగా వుంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ – జనసేన ఒక్కటైతే బావుంటుందన్న అభిప్రాయం, వైసీపీలోని ఓ వర్గం నుంచి గట్టిగా వినిపిస్తోంది.
Also Read: ‘సారా’జకీయం.! పొలిటికల్ లిక్కర్.. పాపం అందరిదీ.!
టీడీపీ కంటే, వైసీపీనే బెటర్.. అనిపించేలా, టీడీపీ క్యాడర్ తీరు.. జనసేన పట్ల కనిపిస్తుందన్నమాట వాస్తవం. అంతలా, జనసేన – టీడీపీ మధ్య సోషల్ యుద్ధం జరుగుతోంది.
అయినా, ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. ఎన్నికలకు ముందర పొత్తుల రాజకీయాలుంటాయ్. ఇప్పటికిప్పుడు, 2029 ఎన్నికల గురించి ఊహించి చెప్పలేం.
కానీ, 2024 ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వైసీపీ, 2029 ఎన్నికల నాటికి, ఖచ్చితంగా పొత్తు ఆలోచన అయితే చేసే అవకాశం లేకపోలేదు.
