Pawan Kalyan Bro Remuneration.. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘బ్రో’ విడుదలకు సిద్ధమైంది. తొలిసారిగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఇది.
మేనమామ, మేనల్లుడు.. తెరపై చేసే ఆ సందడి కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కేతిక శర్మ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కి జోడీగా నటించింది.
దాదాపు 25 రోజులపాటు పవన్ కళ్యాణ్ ‘బ్రో’ షూటింగ్ కోసం డేట్స్ కేటాయించిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan Bro Remuneration.. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత.?
సినిమా కోసం తనకు రోజుకి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ లభించినట్లు పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) స్వయంగా ప్రకటించారు.
మొత్తంగా 25 నుంచి 27 రోజుల వరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం పని చేశారు. ఆ లెక్కన, యాభై కోట్ల పైనే ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నారు.

‘బ్రో’ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ పనిచేసిన సంగతి తెలిసిందే. తమిళ సినిమా ‘వినోదియ సితం’కి ఇది తెలుగు రీమేక్.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రో’కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక మార్పులు చేశాడు. అలా త్రివిక్రమ్ కూడా గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడు.
గిట్టుబాటు అవుతుందా.?
‘బ్రో’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 180 కోట్లు.. అనే ప్రచారమొకటి తెరపైకొచ్చింది. అది నిజమేనా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
నిర్మాతకి ఏమీ మిగలదనీ, హీరో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పేరుతో సింహభాగం దక్కించుకోగా, లాభాల్లోనూ ఆయనకు వాటా వుందంటూ గాసిప్స్ షురూ అయ్యాయ్.
ఈ లెక్కలేవీ వేసుకోకుండానే, నిర్మాతలు ‘బ్రో’ సినిమాని టేకప్ చేశారని అనుకోగలమా.? కాకపోతే, పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవాలంతే. అదీ అసలు సంగతి.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలకు ఏపీలో ఇబ్బందులు వచ్చినా, ‘బ్రో’ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌కి యాభై కోట్లు రెమ్యునరేషన్‌గా ఇచ్చారంటే, ఆ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక, గాసిప్స్ పేరుతో ఏడుపంటారా.? అదంతే.! ఏడ్చి ఏడ్చి చచ్చేలా వున్నారు.. పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతో రగిలిపోతున్నోళ్ళు.!