Pawan Kalyan 2025 OG.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి 2025లో బోల్డన్ని సినిమాాలొచ్చాయ్.! సంక్రాంతి పండక్కీ, విజయదశమికీ.. మధ్యలో వేసవికీ.. చాలా సినిమాలొచ్చాయ్.!
వచ్చాయంటే, వచ్చాయంతే.! వచ్చిన సినిమాలు వచ్చినట్లే బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయ్.! కొన్ని చిన్న సినిమాలు అంచనాలకు మించి విజయాన్ని అందుకున్నాయ్.
భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు దారుణ పరాజయాల్ని చవిచూశాయ్.
‘ఇక, సినిమాలు ఖర్చు దండగ వ్యవహారం’ అనే స్థాయికి, ఎగ్జిబిటర్లతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు కూడా విసిగిపోయారంటే, అతిశయోక్తి కాదు.
Pawan Kalyan 2025 OG.. సక్సెస్ రేట్.. మామూలే కదా.!?
నిజానికి, తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ ఎప్పుడూ తక్కువే.! ఇతర భాషల సినీ పరిశ్రమలతో పోల్చితే మాత్రం, టాలీవుడ్ కాస్త బెటర్.!
అయితే, సినిమాలు సకాలంలో విడుదల కాక, ముఖ్యమైన పండగలు, సీజన్స్‌ని పెద్ద సినిమాలు మిస్ చేసుకుని.. వెరసి, ప్రేక్షకులకి సినిమా అంటేనే, విరక్తి వచ్చేలా చేసింది 2025.
ఏడాది మొత్తంలో, మూడొందల కోట్ల వసూళ్ళు సాధించిన ఒకే ఒక్క స్ట్రెయిట్ సినిమా పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ మాత్రమే.!
పవన్ కళ్యాణ్ నుంచే వచ్చిన ‘హరి హర వీర మల్లు’ సినిమా నిరాశపర్చింది. నిజానికి, అసలు విడుదల కాదనుకున్న ‘హరి హర వీర మల్లు’ విడుదలయ్యిందంటే, అదీ పవన్ కళ్యాణ్ వల్లనే.
అలా చూస్తే, ‘హరి హర వీర మల్లు’ సినిమాని ఫ్లాప్ అనీ, డిజాస్టర్ అనీ అనేయలేం. ఎబౌ యావరేజ్.. అనే లెక్కల్లో వేయాల్సి వుంటుంది. నిర్మాత గట్టున పడ్డారు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని.
చాలాకాలం పాటు నిర్మాణం జరుపుకున్న సినిమా ‘హరి హర వీర మల్లు’.! దాంతో పోల్చితే, కాస్త తక్కువ సమయం పట్టినా, ‘ఓజీ’కి కూడా, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ఇబ్బంది తప్పలేదు.
కోట్లాదిమంది అభిమానుల్లో ఒకడు సుజీత్..
అయితేనేం, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఓజీ సుజీత్, తన అభిమాన నటుడితో అద్భుతమైన సినిమాని తెరకెక్కించి, సూపర్ హిట్ కొట్టాడు.
‘మిరాయ్’, ‘లిటిల్ హార్ట్స్’ లాంటి సినిమాలు ఈ ఏడాది బాగానే సందడి చేశాయి. వీటిల్లో ‘లిటిల్ హార్ట్స్’ చాలా చిన్న సినిమా.. కానీ, చాలా పెద్ద విజయాన్ని అందుకుంది.
‘మా సినిమా హిట్టే..’ అని చాలా సినిమాలు ఈ ఏడాది చెప్పుకున్నా, అవేవీ బాక్సాఫీస్ దగ్గర జెన్యూన్‌గా నిలబడలేకపోయాయి.!
వచ్చే ఏడాది.. అంటే, 2026 మాత్రం తెలుగు సినిమాకి స్వర్ణయుగమే.. అనేంతలా పెద్ద సినిమాల రిలీజ్‌లు వున్నాయి. సంక్రాంతి సంబరాలు ‘ది రాజా సాబ్’తో మొదలవుతాయి.
మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘మన శంకర వర ప్రసాద్’ రాబోతోంది. రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా, వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌లోనే ప్రేక్షకుల్ని పలకరించనుంది.
పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా, 2026 తొలి క్వార్టర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.
