Pawan Kalyan.. సినీ నటుడు అలీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు. ఆ స్నేహం ఇద్దరి మధ్యా ఇంకా అలాగే వుందా.?
2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ – అలీ మధ్య రాజకీయ విభేదాలు వచ్చాయి. జనసేనలో చేరేందుకు సిద్ధమై, చివరి నిమిషంలో ఆయన వైసీపీ వైపు వెళ్ళారు.
రాజకీయాలన్నాక ఎవరిష్టం వారిది. కానీ, వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశాడు అలీ. పవన్ కళ్యాణ్ కూడా అలీ విషయంలో నర్మగర్భమైన వ్యాఖ్యలు చేయడం అప్పట్లో పెద్ద చర్చకే తెరలేపింది.
అలీకి ఎందుకు ఛాన్స్ దొరకలేదబ్బా.?
రాజకీయం వేరు, సినిమాలు వేరు.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మళ్ళీ అలీ నటిస్తాడా.? నటించడా.? ప్రకాష్ రాజ్ కూడా గతంలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశాడు.
కానీ, పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలీ మాత్రం, అటు ‘వకీల్ సాబ్’లోగానీ, ఇటు ‘భీమ్లానాయక్’లోగానీ నటించలేదు.
ఎందుకు.? అంటే, ‘ఆ సినిమాల్లో కమెడియన్లు ఎవరూ లేరు.. కామెడీకి అవకాశం లేదు.. అవి సీరియస్ సినిమాలు.. ఒకవేళ పవన్ తదుపరి సినిమాల్లో కామెడీ వుంటే, నేనూ వుంటా..’ అని సెలవిచ్చాడు అలీ.
Pawan Kalyan మీద మళ్ళీ అలీ రాజకీయ విమర్శలు.?
ఔనా.? నిజమా.! ఇదెక్కడి వింత.? ‘వకీల్ సాబ్’ సినిమాలో సునీల్, సప్తగిరి తదితరులకు ఛాన్స్ దొరికినప్పుడు అలీకి ఎందుకు ఛాన్స్ దొరకదు.? లాజిక్కే కదా.!
Also Read: పూజా హెగ్దే కాదు.! అనుపమ పరమేశ్వరన్ మాత్రమే.!
అలాగని పవన్ కళ్యాణ్ కావాలని అలీని దూరం పెడుతున్నారని అనుకోలేం. కానీ, ఎక్కడో వ్వవహారం తేడాగానే కనిపిస్తోంది.
అన్నట్టు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి వైసీపీ ప్రభుత్వంలో లభించిన సంగతి తెలిసిందే.! సో, పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తరఫున అలీ రాజకీయ విమర్శలు చేయక తప్పకపోవచ్చు.