Pawan Kalyan Anna Konidela.. ఒక్క ఫొటో.. ఒకే ఒక్క ఫొటో.! వాళ్ళందరి బాగోతాల్నీ రోడ్డుకీడ్చింది. సెలబ్రిటీలైనంత మాత్రాన.. వారికి వ్యక్తిగత జీవితాలు వుండవా.?
ఈ మాత్రం ఇంగితం వుంటే.. ఇక మాట్లాడుకోవడానికేముంది.? పవన్ కళ్యాణ్.. ఆయన భార్య అన్నా లెజినెవా.. ఇద్దర సోషల్‌గా విడిపోయారన్నది ఓ వెకిలి వార్త.
అక్కడి నుంచి మొదలైంది ప్రసహనం. నిజానికి, ఇది పాత పుకారే. దాన్ని కొత్తగా వండి వడ్డించారంతే.
Pawan Kalyan Anna Konidela.. స్టేట్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు..
అదేంటో, పవన్ కళ్యాణ్ పెళ్ళి చేసుకోవడం.. అన్నది జాతీయ సమస్యగా కొందరు అభివర్ణిస్తుంటారు.
ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తులు కూడా దిగజారి విమర్శలు చేస్తుంటారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద.
తమ ఇంట్లోని ‘ముడ్డి కింద నలుపు’ని మర్చిపోయి.. కాదు కాదు, మర్చిపోయినట్లు నటిస్తూ, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం చాలామందికి ఓ వ్యసనంలా తయారైంది.
స్టేట్ మీడియా.. నేషనల్ మీడియా.. ఈ అంశంపై ఇంతలా ఫోకస్ పెట్టడానికి కారణం పెయిడ్ మీడియా.
లక్షలు తగలేశారు.. పరువు బజార్న పడేసుకున్నారు..
లక్షలు ఖర్చు చేశారట, పవన్ కళ్యాణ్ మీద జుగుప్సాకరమైన పుకార్లను ప్రచారం చేయించడం కోసం. స్టేట్ మీడియానే కాదు, నేషనల్ మీడియా కూడా అమ్ముడుపోవడం కొసమెరుపు ఇక్కడ.
ఒక్క ఫొటోతో.. అంతా తారుమారైపోయింది. భార్య అన్నా లెజినెవాతో కలిసి పవన్ కళ్యాణ్ తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది.
Also Read: Kajol Devgn.. లస్టూ.! కాజోల్ చెప్పిన లిస్టూ.!
అంతే, అందరి నోళ్ళూ తాత్కాలికంగా మూతబడ్డాయ్.! ఇప్పుడు మిగిలింది ఒక్కటే.!
ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై పుకార్లు ప్రచారం చేశారో.. వాళ్ళ వాళ్ళ జీవిత భాగస్వాములు.. ఏ కొంపల్లో దొర్లుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవడం.
‘రంకు’ అలవాటైపోతేనే, ఇతరులకు దాన్ని అంటగట్టేస్తుంటారు చాలామంది. ఈ అమ్ముడుపోయే రంకు బాపతుని, పాత్రికేయ వ్యభిచారం అనొచ్చా.? డౌటేముంది.? నిస్సందేహంగా అనొచ్చు.