Pawan Kalyan Bhavadeeyudu Bhagatsingh.. ఓ వైపు రాజకీయాలు, ఇంకో వైపు సినిమాలు.. మధ్యలో కోవిడ్ పాండమిక్.. వెరసి, పవన్ కళ్యాణ్ ఒకింత డైలమాలో పడిపోయిన మాట వాస్తవం.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వతహాగానే ‘నెమ్మదిగా’ సినిమాలు చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే.
రాజకీయాల గోల లేనప్పుడే, ఏడాదికి ఓ సినిమా పవన్ కళ్యాణ్ నుంచి రావడం కష్టమయ్యేది. అలాంటిది, అటు రాజకీయాల్లో బిజీగా వుంటే, ఇటు సినిమాల్ని వేగంగా చేయడమంటే అదెంత కష్టమైన పని పవన్ కళ్యాణ్‌కి.?
అయినాగానీ, ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాల్ని పవన్ వేగంగానే పూర్తి చేశారు. కానీ, కోవిడ్ పాండమిక్ కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో, సినిమాల నిర్మాణంలో ఒకింత వేగం తగ్గింది. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న సినిమా ‘హరిహర వీర మల్లు’.
సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదియ సితం’ రీమేక్ చేయాల్సి వుంది పవన్ కళ్యాణ్. అంతకన్నా ముందే ప్రకటితమైన ‘భవదీయుడు భగత్‌సింగ్’ విషయంలో మాత్రం సస్పెన్స్ వీడటంలేదు.
Pawan Kalyan Bhavadeeyudu Bhagatsingh ఎందుకింత గందరగోళం.?
ఇటీవల ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో, ‘భవదీయుడు భగత్ సింగ్’ మీద పవన్ కళ్యాణ్ స్వయంగా స్పష్టతనిచ్చారు. సినిమా ఖచ్చితంగా వుంటుందని చెప్పారు.
అయినాగానీ, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాపై అనుమానాలైతే అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న గాసిప్స్, దర్శకుడు హరీష్ శంకర్‌ని కొంతమేర ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం.

ఈ క్రమంలోనే ఆయన ఓ వీడియో షేర్ చేశారు. అందులో కేసీయార్ మాట్లాడుతున్న మాటలున్నాయ్.
‘ఎవరెవరో ఏవేవో అంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నది ఆ వీడియో సారాంశం. కేసీయార్ మార్కు పదజాలం ‘పనికిమాలిన వెధవలు..’ అందులో వుందనుకోండి.. అది వేరే సంగతి.
ఇంకోపక్క, ఎవరైతే రూమర్లను సృష్టిస్తున్నారో, వాళ్ళు మాత్రం.. ‘గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారెందుకు’ అని హరీష్ మీద రివర్స్ ఎటాక్‌కి దిగారు.
Also Read: గెలవాలంటే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి.?
కొంతకాలంగా హరీష్ శంకర్, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నమాట వాస్తవం. పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప, సినిమా పట్టాలెక్కదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో పవన్ రాజకీయాల్లో బిజీ అయితే, ‘భగత్ సింగ్’ పరిస్థితేంటి.? అన్న అనుమానం కలగడం ఎవరికైనా సహజమే కదా.!