పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (Happy Birthday Pawan Kalyan) నేపథ్యంలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా నాలుగు అప్‌డేట్స్ బయటకొచ్చాయి.
జనసేన అధినేతగా రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషించే క్రమంలో, సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్, తిరిగి సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్న విషయం విదితమే.
కరోనా దెబ్బకి ఆ ప్రాజెక్టులన్నీ దాదాపుగా గల్లంతయినట్లేనన్న దుష్ప్రచారం మొదలైంది. అయితే, ఆయా సినిమాల తాలూకు సీరియస్‌నెస్ ఏంటనేది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరింత స్పష్టమయ్యింది. ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి మోషన్ పోస్టర్ వచ్చింది.
క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి (PSPK27) సంబంధించి ప్రీ లుక్‌ని విడుదల చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా (PSPK28) తాలూకు కాన్సెప్ట్ పోస్టర్ బయటకొచ్చింది. ఇవే కాదు, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించనున్న సినిమా అప్‌డేట్ కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించడం గమనార్హం.
వచ్చిన అప్‌డేట్స్ అన్నీ దేనికదే అన్నట్లున్నాయ్. ఒకదాన్ని మించిన (Happy Birthday Pawan Kalyan) అప్‌డేట్ ఇంకొకటి. ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్‌తో అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. దాన్ని మించేలా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ మరింత మాస్ టచ్‌తో దర్శనమిచ్చింది.
‘ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. అంతకు మించి’ అన్నట్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా తాలూకు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడం గమనార్హం. ఇందులో ఓ మోడ్రన్ బైక్, దాంతోపాటుగా పెద్ద బాల శిక్ష.. వంటివి కన్పించాయి. దేనికదే భారీతనంలో ఒకదానితో ఒకటి పోటీ పడేలా వున్నాయి.
‘వకీల్ సాబ్’ తప్ప అన్నీ పాన్ ఇండియా సినిమాలనదగ్గవే అన్నట్లుగా ఆ రేంజ్ ఫీల్ కల్గించాయి. సురేందర్ రెడ్డి, రామ్ తాళ్ళూరి సినిమాకి (PSPK29) సంబంధించి జస్ట్.. కాంబినేషన్‌ని కన్‌ఫర్మ్ చేస్తూ డిజైన్ విడుదల చేశారంతే.