Pawan Kalyan Chandrababu Meeting.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో హైద్రాబాద్‌లో భేటీ అయ్యారు.
గత కొద్ది రోజులగా పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స నిమిత్తం, మంగళగిరి నుంచి హైద్రాబాద్‌కి వెళ్ళారు పవన్ కళ్యాణ్.
హైద్రాబాద్‌లో పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వైద్యులు సూచించిన మెడికేషన్ మీద వున్నారు.
ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్‌ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైద్రాబాద్‌కి వెళ్ళడం జరిగింది.
Pawan Kalyan Chandrababu Meeting.. ఆరోగ్య పరిస్థితిపై వాకబు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. క్షేమ సమాచారాలు పవన్ కళ్యాణ్‌ని అడిగి తెలుసుకున్నారు.
ఇంటికి వచ్చిన చంద్రబాబుని సాదరంగా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. అనంతరం, ఇరువురూ కాస్సేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

ఏ అంశాలపై ఇరవురి మధ్యా చర్చ జరిగి వుండొచ్చు.? అన్న విషయమై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు సహా, కూటమికి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందన్నది అంతటా వినిపిస్తోన్నమాట.
బాలకృష్ణ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చిందా.?
అసెంబ్లీ వేదికగా, చిరంజీవి ప్రస్తావనను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తీసుకురావడం, ఆ ప్రస్తావనపై హద్దులు మీరి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడటం తెలిసిన విషయాలే.
బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో, చంద్రబాబు మందలించడం కూడా జరిగిందనే వార్తలొస్తున్నాయి.
ఆ మందలింపు వార్తల నేపథ్యంలోనే, చంద్రబాబు హైద్రాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ని కలిశారా.? అన్న అనుమానం తెరపైకి రావడం సహజమే కదా.!
Also Read: జై చిరంజీవ.! నీ నామ జపమే వాళ్ళకి బతుకుదెరువు.!
చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ సందర్భంగా, ఖచ్చితంగా బాలయ్య అంశం కూడా ప్రస్తావనకి వచ్చి వుండొచ్చు.
ఎందుకంటే, చిరంజీవి విషయంలో ఎవరైనా హద్దులు దాటి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ దాన్ని చాలా చాలా సీరియస్‌గా తీసుకుంటారు మరి.
