Pawan Kalyan Cricket Donations.. జన సేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరో సాయంతో అందరి మన్ననలూ పొందుతున్నారు.
అంధుల మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విజేతల ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, టీమ్ మొత్తానికి 84 లక్షల రూపాయలను అందించారు.
ఒక్కో క్రికెటర్‌కీ ఐదు లక్షలు, అలానే టీమ్ సిబ్బందికి ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున.. మొత్తం 84 లక్షల రూపాయల్ని వ్యక్తిగత సంపాదన నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చారు.
సంబంధిత చెక్కుల్ని స్వయంగా వారికి అందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహిళా క్రికెటర్లకు పట్టు చీరలు, కొండపల్లి బొమ్మలు, జ్ఞాపికలు సైతం అందించారు.
Pawan Kalyan Cricket Donations.. బహుమతులకు మురిసిపోయిన మహిళా క్రికెటర్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి అందిన బహుమతుల్ని చూసి మురిసిపోయారు మహిళా క్రికెటర్లు.
వారిలో ఓ మహిళా క్రికెటర్, తమ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదని చెప్పడంతో, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, రోడ్డుని మంజూరు చేయించారు.
పవన్ కళ్యాణ్, ఇలా తన వ్యక్తిగత సంపాదన నుంచి సాయం చేయడం, విరాళాలు అందించడం, బహుమతులు ఇవ్వడం ఇదే కొత్త కాదు.!

అదే సమయంలో, సమస్యల్ని ఎవరైనా తన దృష్టికి తీసుకు వస్తే, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఆయా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ, ఆయన ఇచ్చిన గౌరవం తమకెంతో ప్రత్యేకమని మహిళా క్రికెటర్లు చెప్పుకొచ్చారు.
Also Read: ఫ్యాషన్ ఐకాన్: మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండీ సిగ్నేచర్.!
రాజకీయాల్లో ఇంతకు ముందెవరూ ఇంతలా, వ్యక్తిగత సంపాదన నుంచి సాయం చేసిన పరిస్థితులే లేవన్నది నిర్వివాదాంశం.
ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు గతంలో, ఏ పదవీ లేని సమయంలో లక్ష రూపాయల చొప్పున మొత్తంగా కోట్లాది రూపాయల సాయం చేశారు జనసేనాని.
విజయవాడ వరదల నేపథ్యంలో కోట్లాది రూపాయల వ్యక్తిగత సంపాదనను డిప్యూటీ సీఎం హోదాలో వుండి కూడా సాయం చేశారు పవన్ కళ్యాణ్.
