Pawan Kalyan Fever Bro.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, ‘వారాహి విజయ యాత్ర’ సందర్భంగా కొంత అస్వస్థతకు గురయ్యారు.
మనిషన్నాక.. చిన్నా చితకా అనారోగ్య సమస్యలు మామూలే. వేసవి నుంచి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు సహజంగానే వైరల్ జ్వరాలు వస్తుంటాయి.
జ్వరంతో ‘వారాహి విజయ యాత్ర’ చేయడం ఆరోగ్య రీత్యా మంచిది కాదు.! ఈ కారణంగా, పార్టీ ముఖ్య నేతల సూచన మేరకు, విశ్రాంతి తీసుకోక తప్పలేదు జనసేనానికి.
Pawan Kalyan Fever Bro.. జ్వరం.. రాజకీయ రోగం.!
పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడే సినిమా షూటింగులు.. అంటూ ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎక్కడుంటే అక్కడ.. అంటే, దానర్థం.. అాయనకు అందుబాటులో వుండేలా సినిమా షూటింగుల్ని ప్లాన్ చేస్తామని.

అలాంటప్పుడు, డబ్బింగ్ చెప్పేందుకు ఎక్కడైతే ఏముంది.? పవన్ కళ్యాణ్ బస చేసిన ప్రాంతంలో, ‘బ్రో’ టీజర్ కోసం డబ్బింగ్ చెప్పించేశాడు దర్శకుడు సముద్రఖని.
అంతే.. రాజకీయ ప్రత్యర్థులకు రోగమొచ్చేసింది. ‘డబ్బింగ్ చెప్పడం కోసం జ్వరం పేరుతో నాటకం ఆడి వారాహి విజయ యాత్రకు బ్రేక్ వేసుకున్నారు’ అంటూ వెకిలి ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.
డబ్బింగురా బాబూ.. కోడి కత్తి డ్రామా కాదు.!
కోడి కత్తి డ్రామాకీ.. సినిమాకి డబ్బింగ్ చెప్పడానికీ చాలా తేడా వుంది. సినీ నటి సమంత, ‘యశోద’ సినిమా కోసం ఆసుపత్రిలో వుండి డబ్బింగ్ చెప్పింది.
సినీ జనాల కమిట్మెంట్ అలాంటిది. రాజకీయ నాయుకులైతే కోడి కత్తి లాంటి డ్రామాలు ఆడుతుంటారు. నిరాహార దీక్షల పేరుతో దొంగ దీక్షలు చేస్తుంటారు.
కార్లు లేవని ఎన్నిక అఫిడవిట్లో చెప్పడం రాజకీయ నాయకులకు చెల్లుతుంది. నిజానికి, రాజకీయ నాయకులే అసలైన నటులు.
Also Read: Dead Pixels Review: సచ్చిపోండ్రా బాబూ.!
సినిమా జనాలు కేవలం సినిమాల్లోనే నటిస్తారు. రాజకీయ నాయకులు అలా కాదు.. ప్రజా జీవితంలో నటిస్తుంటారు… అదీ సిగ్గూ ఎగ్గూ వదిలేసి.!
‘వారాహి విజయ యాత్ర’లో ఓ సినిమాకి డబ్బింగ్ చెబితేనే, గింజుకు సచ్చిపోతున్న రాజకీయ ప్రత్యర్థులు, రేప్పొద్దున్న పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగులు కూడా ఆయనకు అందుబాటులో జరిగితే ఏమైపోతారో.?