Pawan Kalyan Jail Sketch.. ఎవరికి ఎక్కడ చెప్పాలో అక్కడ చెబితేనే బాగా బుర్రకెక్కుతుంది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసింది అదే.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజమండ్రి కేంద్ర కారాగారం సాక్షిగా, చెప్పాలనుకున్నది చెప్పారు.! ఇంతకీ, ఎవరికి ఆయన ఏం చెప్పారు.?
టీడీపీ – జనసేన వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయన్న విషయం జనంలోకి ఎప్పుడో వెళ్ళిపోయింది. అయితే, అధికారిక స్పష్టత కాస్త ఆలస్యమయ్యిందంతే.
సమయం.. సందర్భం అవసరం కదా.! వేదిక కూడా పక్కాగా సెట్ అయ్యింది.! కొందరికి బాగా కలిసొచ్చిన జైలు వేదికగానే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘కౌంటర్ ఎటాక్’ చేశారు.!
Pawan Kalyan Jail Sketch.. దత్త పుత్రుడు కాదు.. దమ్మున్నోడు.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పదే పదే ‘దత్త పుత్రుడు’ అనే విమర్శ చేస్తుంటారు వైసీపీ నేతలు.
‘జైల్లో పుట్టిన పార్టీ’ అన్న విమర్శ వైసీపీ మీద ఎప్పటినుంచో వుంది. సో, అదే జైలు సాక్షిగానే, వైసీపీకి ఝలక్ ఇచ్చారు జనసేన అధినేత.
టీడీపీ – వైసీపీ మధ్య పొత్తు కుదరకూడదన్న కోణంలో వైసీపీ నానా యాగీ చేసింది. అధినేత వైఎస్ జగన్ సహా, వైసీపీ నేతలంతా ‘దమ్ముంటే సింగిల్‌గా పోటీ చెయ్..’ అంటూ జనసేనానికి సవాల్ విసిరినవాళ్ళే.

ఆయన సింగిల్ సింహమా.? మేం, మనుషులం.. జంతువులం కాదు.. అంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్.
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో ములాఖత్ అయ్యారు పవన్ కళ్యాణ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుతో ములాఖత్ అనంతరం, అదే జైలు యెదుట ప్రెస్ మీట్ సందర్భంగా జనసేనాని, ‘జంతువు – మనిషి’ పోలిక తీసుకురావడం చిన్న విషయం కాదు.
లోకేష్‌కి ఝలక్..
దత్త పుత్రుడన్న ప్రస్తావన తొలుత తెచ్చిందే నారా లోకేష్. ఆ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ రాక కోసం జైలు దగ్గర ఎదురు చూడాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతోంటే, పక్కనే చేతులు కట్టుకుని లోకేష్ నిల్చోవాల్సి రాక తప్పలేదు. బాలయ్యదీ అదే వరస.!
Also Read: 360 డిగ్రీస్ తెగులు.! ఈ ‘పచ్చ’ జాడ్యానికి చికిత్స లేదు.!?
ఒక్క దెబ్బకి చాలా పిట్టలు.! అన్నీ జైలు సాక్షిగానే షాక్‌కి గురయ్యాయ్.! కొన్నిటికి తప్పదు, పవన్ కళ్యాణ్‌తో కలిసి నడవాలి. లేకపోతే భవిష్యత్తు లేదు.
కొన్నిటికి తప్పదు, పవన్ కళ్యాణ్‌ని తూలనాడాలి.. లేకపోతే, వాటికీ భబిష్యత్తు లేదంతే.!