Pawan Kalyan Maheshbabu Friendship.. అది ఓ ప్రముఖ న్యూస్ ఛానల్. ఒకప్పుడు నెంబర్ వన్ న్యూస్ ఛానల్. తెలుగు నాట మీడియా రంగంలో ఓ సంచలనం. కానీ, రాను రాను బ్లాక్‌మెయిల్ జర్నలిజంతో పరువు పోగొట్టుకుంది.
ఆ ఛానల్ పేరు చెప్పి పేరు ప్రఖ్యాతులు గడించిన ఓ సీనియర్ జర్నలిస్టు, ఆ సంస్థలో వాటాలు దక్కించుకుని, ‘యజమాని’గా చెలామణీ అయ్యాడు.. ఆ తర్వాత ఆ ఛానల్ నుంచి గెంటివేయబడ్డాడు కూడా.
‘మెరుగైన సమాజం కోసం’ అని చెప్పుకుని, సమాజాన్ని నాశనం చేసేలా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయడం ఆ ఛానల్‌కే చెల్లింది. యాజమాన్యం మారినా, ఆ ఛానల్ తీరు మారలేదు.
అత్యంత జుగుప్సాకరమైన కథనాల్ని సినీ సెలబ్రిటీల విషయంలో వండి వడ్డించడమే ఆ ఛానల్ ప్రత్యేకత.
దిగజారిపోవడంతోనూ సమ్‌థింగ్ స్పెషల్.!
ఇంతకన్నా దిగజారడానికి ఇంకేముంటుంది.. అని జనం ఛీత్కరించుకుంటున్న ప్రతిసారీ, అంతకు మించి దిగజిరిపోతూనే వుంటుంది.

విలువలు, వంకాయలు.. ఏమీ లేని ఆ ఛానల్, తాజాగా సూపర్ స్టార్ మహేష్ అభిమానులతో పంచాయితీ పెట్టుకుంది. అంతకు ముందు ఓ చిన్న నటుడితో వివాదం, ఆ ఛానల్ పరువుని బజార్న పడేసింది.
మహేష్ (Super Star Maheshbabu) అభిమానులతో పెట్టుకుంటే ఏమవుతుంది.? అయినా, నిండా బురదలో కూరుకుపోయిన ఆ ఛానల్‌కి ఏమవుతుంది.?
Pawan Kalyan Maheshbabu Friendship.. మహేష్, పవన్ అభిమానులకి ఉమ్మడి శతృవు.!
గతంలో ఈ ఛానల్ సహా, మరికొన్ని యెల్లో ఛానల్స్‌ని బాయ్‌కాట్ చేయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అలా ఆ ఛానల్ ఇప్పుడు మహేష్, పవన్ అభిమానులకు ఉమ్మడి శతృవుగా మారింది.
నిజానికి, మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమకే (Telugu Cinema Tollywood) శనిలా దాపురించింది ఆ ‘బురద ఛానల్’ అనే చర్చ సర్వత్రా జరుగుతోందిప్పుడు.
Also Read: నయనతారకి పెళ్ళి కాకుండానే విడాకులట.!
మీడియా (Telugu Media) అంటే, మారిన ట్రెండ్ నేపథ్యంలో కొంతవరకు గాసిప్స్ తప్పు కాకపోవచ్చు.. ఊహాజనిత కథనాలకూ ఓ హద్దు వుంటుంది. విద్వేషమే పాత్రికేయం.. అనే స్థాయికి దిగజారిపోతే, చరిత్ర క్షమించదు.
చరిత్రదాకా ఎందుకు.? వీక్షకులు హర్షించరు.. అందుకే, ఛానల్ రేటింగ్స్ గణనీయంగా పడిపోతున్నాయ్.