Table of Contents
పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ (Pawan Kalyan Mass Warning) ఇచ్చేశారు. ‘నువ్వెవడివి నాకు చెప్పడానికి.?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.!
ఈ వార్నింగ్, చాలా మంది మీద గట్టిగా పని చేస్తుందా.? బోడి సలహాలు, ఉచిత సలహాలు.. ఇవి కంటిన్యూ అవుతూనే వుంటాయా.?
ఇంతకీ, పవన్ కళ్యాణ్ ఎవరికి వార్నింగ్ ఇచ్చారు.? ఎందుకు వార్నింగ్ ఇచ్చారు.? వివరాల్లోకి వెళితే..
నా పార్టీని ఎలా నడపాలో నాకు తెలుసు..
‘వైసీపీ ఎలా నడపాలో నేను చెబుతానా.? అలాగే, నా పార్టీని నేను ఎలా నడపాలో వాళ్ళెవరు చెప్పడానికి.?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మండిపడ్డారు.
‘నువ్వెవడివి నాకు చెప్పడానికి.? మూసుక్కూర్చో.!’ అంటూ జనసేన అధినేత, అధికార వైసీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
అంతలోనే, ‘నేనూ అలా అనగలను… అనకూడదు కాబట్టి అనడం లేదు..’ అంటూ జనసేనాని పేర్కొనడం గమనార్హం.
Pawan Kalyan Mass Warning.. ఈ బోడి సలహాలెందుకు.?
ఒక్కో రాజకీయ పార్టీ విధానం ఒక్కోలా వుంటుంది. ఇతర పార్టీలకు బోడి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏ పార్టీకి అయినా ఎందుకుంటుంది.? ఎందుకు ఆ స్థాయికి పార్టీలు దిగజారిపోతున్నాయి.?

రాజకీయాల్లో విమర్శలు సహజం.! కానీ, అడ్డగోలు విమర్శలతో, దుష్ప్రచారాలతో రాజకీయం చేయడాన్ని ఏమనాలి.?
నిజానికి, రాజకీయమంటే ప్రజా సేవ. అది మర్చిపోయి, రాజకీయమంటే ‘రంకు’ అన్నట్లుగా తయారైంది పరిస్థితి.
వార్నింగ్.. కేవలం వైసీపీకి మాత్రమే కాదు.!
వైసీపీకి మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకీ.. ఇతర రాజకీయ పార్టీలకీ.. జనసేన అధినేత మాస్ వార్నింగ్ ఇచ్చారు ‘నువ్వెవడివి నాకు చెప్పడానికి.? మూసుక్కూర్చో..’ అనడం ద్వారా.
జనసేన మీద అభిమానం ముసుగులో, జనసేన పార్టీకి ఉచిత సలహాలిచ్చేవారికీ, ‘న్యూట్రల్’ ముసుగులో, జనసేనకి బోడి సలహాలు ఇచ్చే కొందరు ‘మేధావులకీ’ జనసేన అధినేత వార్నింగ్ గట్టిగానే తగులుతుందన్నది నిర్వివాదాంశం.
సాధారణంగా చాలా రాజకీయ పార్టీలకి రాజకీయమంటే ఓ గేమ్.! పవన్ కళ్యాణ్‌కి మాత్రం అది ఓ బాధ్యత.
Also Read: కర్ర పెత్తనం.! ‘పులి’ రాజా.. పారిపో.!
సంపాదన కోసం రాజకీయాల్లోకి వస్తుంటారు చాలామంది. అక్రమార్జనను కాపాడుకోవడం కోసం పార్టీలు పెడుతుంటారు ఇంకొందరు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలా కాదు. సినిమాల్లో వచ్చే కోట్లాది రూపాయల సంపాదనను కాదనుకుని, రాజకీయాల్లోకి వచ్చారు.
సినిమాలు కొనసాగిస్తున్నా, అది పార్టీ నడపడం కోసం.. కష్టాల్లో వున్న ప్రజలకు సాయం చేయడం కోసం.! అలాంటి పవన్ కళ్యాణ్‌కి ఉచిత సలహాలు.. బోడి సలహాలు.. ఎవరిచ్చినా, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.