Table of Contents
Pawan Kalyan National Politics.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఎలా రాజకీయాల్లో ముందడుగు వేశారు.? పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్‌గా ఎలా మారారు.?
2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ ఆవిర్భవిస్తే, 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది.
పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు 2019 ఎన్నికల్లో. నిజానికి, ఈ పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా పుంజుకోవడం దాదాపు అసాధ్యం.
Pawan Kalyan National Politics.. అసాధ్యం… సుసాధ్యమైందిలా..
కానీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో 100 పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో జనసేన పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! జస్ట్ ఈక్వేషన్స్ సెట్ అయ్యేలా, రాజకీయ వ్యూహాలంతే. పక్కా వ్యూహంతో పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికల్లో సత్తా చాటారు.
ఇటీవల విశాఖలో, ‘సేనతో సేనాని’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జనసైనికులు, జనసేనానితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
జాతీయ పార్టీగా జనసేన..
జనసేన క్రియాశీలక కార్యకర్తల నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్, ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే, జాతీయ పార్టీగా జనసేన.. అనే ప్రస్తావన వచ్చింది.
అదే మాట జనసేనాని పవన్ కళ్యాణ్ నోటి నుంచి, ‘సేనతో సేనాని’ బహిరంగ సభలోనూ రావడంతో ఒక్కసారిగా, ఏపీ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయ్యింది.
ఆ మాటకొస్తే, తెలంగాణ రాజకీయాల్లోనూ, తమిళ, కన్నడ రాజకీయాల్లోనూ.. దేశ రాజకీయాల్లోనూ ‘జనసేన జాతీయ పార్టీ’ అనే చర్చ షురూ అయ్యింది.
తెలంగాణలో బలోపేతమయ్యేదెలా.?
తెలంగాణలో, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసినా ఒక్క సీటూ గెలవలేకపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.
సో, తెలంగాణలో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయన్నమాట. తమిళనాడులోనూ, కర్నాటకలోనూ జనసేనాని పొలిటికల్ మేనియా ఇప్పుడిప్పుడే చూస్తున్నాం.
సినిమా గ్లామర్.. ఆపై, సనాతన ధర్మం.. ఈ రెండూ, జనసేనానికి జాతీయ రాజకీయాల్లో అడ్వాంటేజ్. బీజేపీతో జనసేనకి మైత్రి వుండనే వుంది.!
Also Read: Sarzameen Telugu Review: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం.!
జాతీయ పార్టీగా మారాలంటే, కొన్ని లెక్కలుంటాయ్. వాటికి అనుగుణంగా జనసేన రాజకీయ ప్రయాణం ముందుకు సాగితే.. జనసేన జాతీయ పార్టీ అయి తీరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాకపోతే, దానికి చాలా సమయం వుంది.! ప్రస్తుతానికైతే ఏపీతోపాటు, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేనాని రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.
– yeSBee