Pawan Kalyan OG Remuneration.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఓజీ’.! అసలు ‘ఓజీ’ అంటే ఏంటి.? అంటే, దానికి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా ‘డీవీవీ’ బ్యానర్‌పై నిర్మితమవుతోంది.
కాగా, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
నిజానికి, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి ‘వకీల్ సాబ్’ సినిమా టైమ్‌లోనే చాలా పెద్ద చర్చ జరిగింది. అప్పట్లో ఆయన ఆ సినిమా కోసం 50 కోట్ల పైన తీసుకున్నట్లు వార్తలొచ్చాయ్.
రాజకీయ విమర్శలూ..
చిత్రంగా, పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసుకునే రెమ్యునరేషన్ గురించి రాజకీయాల్లోనూ పెద్ద రచ్చే అయ్యింది. ఆయన సినిమాల్ని అడ్డుకునేందుకు చాలా చాలా ప్రయత్నాలూ జరిగాయి, జరుగుతూనే వున్నాయ్.
తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరో విషయంలోనూ రాజకీయం ఇంతలా దిగజారిపోలేదు. అయినాగానీ, ఎంతలా బెదిరింపులకు దిగుతున్నాగానీ.. పవన్ కళ్యాణ్ రేంజ్ తగ్గడంలేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు. కొత్త తరం దర్శకులు మంచి మంచి కథలతో పోటీ పడుతున్నారాయె.
Pawan Kalyan OG Remuneration.. వంద కోట్లకు చేరువలో..
‘ఓజీ’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 75 కోట్ల రెమ్యునరేషన్ సాలిడ్‌గా తీసుకుంటున్నారన్నది తాజా ఖబర్. దీనికి అదనంగా లాభాల్లో వాటా కూడానట.
ఓ వైపు పవన్ కళ్యాణ్ సినిమాల్ని అడ్డుకునేందుకు రాజకీయంగా కొందరు ప్రయత్నిస్తోంటే, ఇంకోపక్క ఆయన స్థాయి మాత్రం అస్సలు తగ్గడంలేదు సరికదా.. మరింత పెరుగుతోంది.!
Also Read: ‘కశ్మీర్ ఫైల్స్’ చెత్త.! ప్రకాష్ రాజ్.. పిచ్చి మొరుగుడు.!
అటూ ఇటూగా వంద కోట్ల రెమ్యునరేషన్ అంటే.. పవన్ కళ్యాణ్ రేంజ్ అలా వుంది మరి.! రాజకీయాల కారణంగా పవన్ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదాయె.! కానీ, పవన్ రెమ్యునరేషన్ పెరుగుతూనే వుంది.