Pawan Kalyan Pithapuram.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
చాలా వ్యూహాత్మకంగా జనసేనాని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని అనుకోవచ్చా.? అంతేనేమో.!
పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నహితుడైన తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గంలో గత కొంతకాలంగా ‘గ్రౌండ్ వర్క్’ చేస్తున్నారు.
తంగెళ్ళ ఉదయ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం తొలుత జరిగింది. అయితే, ఆయన్ని కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్.

పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నానని జనసేనాని ఇటీవల ప్రకటించినా, 2019 ఎన్నికల సమయంలోనే ఈ నియోజకవర్గం గురించి చాలా లోతుగా లెక్కలేసుకున్నారట ఆయన.
అనివార్య కారణాలవల్ల భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సి వచ్చింది జనసేనానికి. ఫలితం అందరికీ తెలిసిందే.
Pawan Kalyan Pithapuram.. వైసీపీ మార్కు వ్యూహాలు..
ఇక, జనసేనాని పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఉప్పందడంతో, ముందుగానే అప్రమత్తమయ్యింది అధికార వైసీపీ. టీడీపీ నేత వర్మ, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఇలా పలువురు కీలక నేతల్ని దువ్వడం మొదలుపెట్టింది.

కాకినాడ ఎంపీ వంగా గీతను, పిఠాపురం అసెంబ్లీకి పంపింది వైసీపీ. ఇది కాకుండా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి, పిఠాపురం బాధ్యతల్నీ వైసీపీ అధినాయకత్వం అప్పగించింది.
అంతేనా, మండలానికి ఓ వైసీపీ కీలక నేతను బాధ్యుడిగా నియమించి, పవన్ కళ్యాణ్‌ని ఓడించేందుకు వ్యూహ రచన చేస్తోంది వైసీపీ అధినాయకత్వం.
లక్షకు తగ్గేదే లే..
అయితే, జనసేనాని పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) మాత్రం, ‘ఓటుకు లక్ష పంచినా, పిఠాపురంలో తనకు లక్ష మెజార్టీ ఖాయం’ అని అంటున్నారు.
స్థానిక ప్రజానీకం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల పూర్తి పాజిటివ్‌గా వున్నా, వైసీపీ వ్యూహాల నేపథ్యంలో లక్ష మెజార్టీ సాధ్యమేనా.? అన్న అనుమానాలు పెరుగుతున్నాయ్.
Also Read: నీలి పాత్రికేయం: అమ్మకానికి.. ‘గే’ట్ వెబ్ సైట్.!
ఒకప్పటి పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పటి పవన్ కళ్యాణ్ వేరు. ఆయన లెక్కలు ఆయనకున్నాయ్.! ఈసారి పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో గెలిచి, అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.