Pawan Kalyan Pithapuram Kids.. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, గౌరవ వేతనంగా తనకు నెల నెలా ప్రభుత్వం నుంచి అందే మొత్తాన్ని, అనాథల కోసం వినియోగించనున్నారు.
ఓ వైపు సినీ నటుడిగా తన సంపాదనను సైతం ప్రజోపయోగ కార్యక్రమాల నిమిత్తం పవన్ కళ్యాణ్ వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే.
విజయవాడ వరదల నేపథ్యంలో కోట్లాది రూపాయల వ్యక్తిగత సంపాదనను, విరాళంగా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, అటు ప్రభుత్వం వైపు నుంచి, ఇటు వ్యక్తిగతంగా తన సంపాదన నుంచీ పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నారాయన.
Pawan Kalyan Pithapuram Kids.. వాళ్ళు గెలిపించారు.. వాళ్ళ బాధ్యతని ఆయన తీసుకున్నారు.!
‘పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నాను… అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఇస్తున్నట్టు తెలిపారు.
పదవి ఉన్నంతకాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు.

శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఆయన తన వేతనం నుంచి ఒక్కొక్కరికీ నెలకి రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 ఆర్థిక సాయం అందించారు.
జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న 32 మందికి స్వయంగా సాయాన్ని అందజేశారు.
మిగిలిన పది మందికీ జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెలా ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేశారు.
Also Read: Thittam Irandu Telugu Review: కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్.!
ఈ సందర్భంగా మాట్లాడుతూ “రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను’’
‘‘ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న భావనతోనే వేతనం తీసుకున్నాను. వేతనం రూపంలో తీసుకున్న ఆ మొత్తాన్ని నన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం, వారి చదువుల ఖర్చు చేయాలనుకున్నాను’’
‘‘ప్రభుత్వం, పదవి ఉన్నంతకాల జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తాను” అన్నారు.