Pawan Kalyan Political Agenda.. నేను ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే అంటాడు ఒకాయన. ఓ నాలుగు సార్లు ఎంపీ అయ్యానంటాడు ఇంకొకాయన. సీనియర్ మంత్రిని అంటాడు మరొకాయన.
సరే, అవన్నీ నిజమే. ప్రజా ప్రతినిధిగా చట్ట సభలకు వెళ్లి, మంత్రులుగా బాధ్యతలు నిర్వహించి ప్రజల్ని ఏం వుద్దరించావ్.?
ఒకాయన జనసేన అధినేతని ‘సన్నాసి’గా అభివర్ణించాడు. ఆయన గతంలో మంత్రిగా పని చేశాడు. బూతులే భవిష్యత్తు అనుకున్నాడు. గేటు ముందర అరిచే గ్రామ సింహాన్నిఇంట్లోకి రానివ్వరన్నట్లు, గేటు నుంచే బయటికి తరిమేసినా బుద్ది రాలేదు.
ఇంకా యజమానికి వర్తాసు పలుకుతూ మొరుగుతూనే వున్నాడాయన. ‘సన్నాసి’ అంటే, ఎవరు.? సన్నాసి అంటే ఎందుకూ పనికి రానోడు.. అని అర్ధం.
Pawan Kalyan Political Agenda.. గెలిచి ఏం సాధించినట్టు.?
గెలిచి, పదవులు చేపట్టి అక్కడికేదో తాను సంసారిని అని చెప్పుకుంటే సరిపోదు. తను మాట్లాడే బూతుల్ని తన కూతురో, తన భార్యో ప్రవచనాలుగా స్వీకరిస్తుందనుకునే మూర్ఖులు అసలు సిసలు సన్నాసులు.
పవన్ కళ్యాణ్ ఏదైనా పదవి చేపట్టి, చేస్తానన్న మంచి చేయకపోతే, అప్పుడు నిజంగానే అతన్ని సన్నాసి అనో, ఇంకోటనో అనడానికి అవకాశం దొరుకుతుంది.
నటుడిగా, సినీ రంగంలో కోట్లు సంపాదించి, అందులో కొంత మొత్తాన్ని కవులు రైతుల కోసం అందిస్తున్న పవన్ కళ్యాణ్, సన్నాసి ఎలా అవుతాడు.?

అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడిన కవులు రైతుల కుటుంబ సభ్యుల కన్నీరు తుడుస్తున్న పవన్ కల్యాణ్ వారి దృష్టిలో దేవుడు.
రేపొద్దున్న ఆయన గెలిచి పదవులు చేపట్టి, ఇప్పుడున్న రాజకీయాల్లో తానూ ఓ భాగమైపోతే అప్పుడు ఆయన్ని నిరభ్యంతరంగా సన్నాసి అనొచ్చు.
ఔను, పవన్ కళ్యాణ్‌ది అత్యాశే.!
ఇప్పటిదాకా రాజకీయాల్లో పదవులు చేపట్టిన వాళ్లు, జనాన్ని మోసం చేస్తూనే వచ్చారు. చేస్తూనే వున్నారు కూడా.
ఈ రాజకీయాల్ని తానేదో మార్చేయాలని పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) అనుకోవడం అత్యాశే. కానీ, ప్రయత్నిస్తానంటున్నారు.
పవన్ కళ్యాణ్‌ని ప్రయత్నించనివ్వండి. ఈలోగా ఆయన మీద అనవసరంగా మొరిగి మీ జాతి ఏంటో, ప్రపంచానికి డప్పేసుకుని మరీ చెప్పుకోవడం మీకే నష్టం.
Also Read: దిశ ఎన్‌కౌంటర్.! ఏది బూటకం.? ఏది న్యాయం.?
ఇంకోసారి ఓడిపోయినా పవన్ కళ్యాణ్‌కి వ్యక్తిగతంగా వచ్చే నష్టమేమీ లేదు. 2019 ఎన్నికల్లో పవన్ ఓడిపోయారు.. ఆయనేమైనా నష్టపోయారా.? 2024 ఎన్నికల్లో ఓడినా అంతే.!
ఓడితే ఆయనకు కాదు నష్టం.! ఆయన్ను గెలిపించుకోలేని ప్రజలదే ఆ కష్టం.!