Pawan Kalyan Political Speed.. మా స్కూల్లో ఆడుకోవడానికి ‘ప్లే-గ్రౌండ్’ లేదు.. అని విద్యార్థులు కోరారు.!
అంతే, ‘నా స్వంత ఖర్చులతో, ఆట స్థలం ఏర్పాటు చేయిస్తా’నని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.. ఆట స్థలాన్ని విద్యార్థులకు ‘బహుమతి’గా ఇచ్చారు.!
మా ఊరికి రోడ్డు లేదు.. అని మహిళా అంధ క్రికెటర్ ఒకరు కోరితే, క్షణాల్లో గంటల వ్యవధిలో, ఆమె కోరిక మేరకు.. ఆ ఊరికి రోడ్డును మంజూరు చేస్తూ, జీవో వచ్చేలా చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఒక్కో మహిళా అంధ క్రికెటర్‌కీ ఐదు లక్షల చొప్పున, మొత్తం టీమ్కీ, సిబ్బందికీ కలిపి 84 లక్షల ఆర్థిక సాయం వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చేసిన సంగతి తెలిసిందే.
లైబ్రరీలో పుస్తకాల్లేవ్.. కంప్యూటర్లూ లేవ్.. అని విద్యార్థులు చెప్పగానే, ‘నేను స్కూల్ నడిపితే ఎలా వుంటుందో.. అలా మార్చుతా..’ అని చెప్పారు పవన్ కళ్యాణ్.
రోజుల వ్యవధిలో పాతిక లక్షల ఖర్చుతో.. అదీ, వ్యక్తిగతంగా.. ఖర్చు చేసి చిలకలూరిపేటలోని ఓ ప్రభుత్వ స్కూల్లో లైబ్రరీకి పుస్తకాలు అలానే కంప్యూటర్లు సమకూర్చారు జనసేనాని.
కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి నియామక పత్రం అందుకున్న ఓ గిరిజన యువకుడు, తన ఊరికి రోడ్డు కావాలని కోరితే, ఆఘమేఘాల మీద రోడ్డుని మంజూరు చేశారు డిప్యూటీ సీఎం.
వాయు వేగంతో… మెరుపు వేగంతో.. రాకెట్ వేగంతో.. ఇలాంటి మాటలు కూడా చిన్నవే అయిపోతాయ్.. అంత వేగంతో, అంతకంటే ఖచ్చితత్వంతో సమస్యలకు పరిష్కారం లభిస్తోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘వేగం’పై ఆశ్చర్యపోతున్నారంటే, అది అతిశయోక్తి కాదేమో.
తన మంత్రి వర్గంలో పని చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంత అద్భుతంగా పని చేస్తోంటే, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆశ్చర్యంతోపాటు, ఆనందమూ కలుగుతుంది మరి.!
గతంలో చాలామంది ఉప ముఖ్యమంత్రులు వుండేవారు.. ఉప ముఖ్యమంత్రులుగా వాళ్ళంతా ఏం చేశారు.? అంటే, ప్చ్.. సమాధానం దొరకదు.
వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! ఉప ముఖ్యమంత్రిగానే పవన్ కళ్యాణ్ ఇంత బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తున్నారంటే, ఆయన ముఖ్యమంత్రి పీఠమ్మీద కూర్చుంటేనో.!?
సాయం చేయడానికి పదవి అక్కర్లేదు.. ఉప ముఖ్యమంత్రి అవకముందూ, తన శక్తికి మించి సాయం చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్.!
పదవి వచ్చాక, ఆ పదవి ద్వారా మరింత ఎక్కువ సేవ చేసే అవకాశం పవన్ కళ్యాణ్‌కి లబించింది.
రాజకీయమంటే సేవ, పరిపాలన అంటే బాధ్యత.! ఇది తు.చ. తప్పకుండా పాటించే నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే.
చివరగా.. రాజకీయాల్లో ఇంతకు ముందెవరైనా ఇలా ఓ వైపు వ్యక్తిగత సాయం చేస్తూనే, ఇంకో వైపు కీలకమైన పదవిలో వుంటూ, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఇంత వేగం ప్రదర్శించారా.? లేనే లేదు.!
