Table of Contents
Pawan Kalyan Red Sandal Warning.. శేషాచలం అడవుల్లో దొరికే ‘ఎర్ర చందనం’ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదిగా చెబుతారు.
అందుకే, శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనానికి అంత డిమాండ్. ఆ ఎర్ర చందనం దశాబ్దాలుగా ‘అక్రమ రవాణా’ బారిన పడుతోంది.!
విచ్చలవిడిగా ఎర్ర చందనం చెట్లను నరికెక్కడం, దుంగల్ని చాటుమాటుగా సరిహద్దులకి తరలించి, అట్నుంచటే విదేశాలకు స్మగుల్ చేయడం.. లాభసాటి వ్యాపారంగా మారిపోయింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్ని ఎర్ర చందనం స్మగ్లర్లు శాసిస్తుంటారనడం అతిశయోక్తి కాదేమో.! రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా, ఎర్ర చందనం స్మగ్లింగ్‌కి ఛాన్సే వుండదు.
విచ్చలవిడిగా ఎర్రచందనం చెట్ల నరికివేత..
పొరుగు రాష్ట్రం తమిళనాడు నుంచీ అలాగే, మరో పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి కూడీ కూలీలు, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత కోసం వస్తుంటారు.
ఎర్రచందనం స్మగ్లర్లలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా వుంటారు. ప్రధానంగా తమిళనాడుతోనే, ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ పంచాయితీ కనిపిస్తుంటుంది.

కూలీలు కూడా ఎక్కువగా తమిళనాడు నుంచే వస్తుంటారు. గతంలో, ఎర్రచందనం కూలీల కాల్చివేత జరిగితే, అది తమిళనాడు – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతగా మారింది కూడా.
ఇప్పటిదాకా ఏ మంత్రీ, ఏ ప్రజా ప్రతినిథీ.. మాట్లాడనంత గట్టిగా, ధైర్యంగా.. ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్..
స్మగర్లకు అలాగే, ఎర్ర చందనం చెట్లు నరికే కూలీలకూ పవన్ కళ్యాణ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన సందర్బంగా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
చెట్లను నరికితే, అరెస్టు తప్పదు.. ఆస్తులూ స్వాధీనం చేసుకుంటామని జనసేనాని హెచ్చరించడంపై, సోషల్ మీడియా వేదికగా ఓ వర్గం ‘భుజాలు తడుముకుంటోంది’.!

‘పేదోళ్ళే గతి లేక చెట్లు నరుకుంటారు.. ఆస్తులే వుంటే, చెట్లు నరికే కూలీలుగా ఎందుకు మారతారు.?’ అన్నది ఆ వర్గం ప్రశ్న.
మరోపక్క, అడవిలో మొక్కలు నాటడమేంటి.? అంటూ ఇంకొందరు అమాయకంగా పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పర్యటనలో చాలా కీలక అంశాలున్నాసరే.. వాటిని విస్మరిస్తూ.
దశాబ్దాల నిర్లక్ష్యం..
ఎర్ర చందనం స్మగ్లింగ్‌కి వ్యతిరేకంగా చట్టాలున్నాయి.. అయినా, వాటిని సరిగ్గా అమలు చేయని దుస్థితి వుంది దశాబ్దాలుగా. లేకపోతే, టన్నుల కొద్దీ ఎర్రచందనం ఏటా, ఎలా సరిహద్దులు దాటుతుంది.?
ఒక్కటిమాత్రం నిజం.. ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆగాలంటే, పాలకుల్లో చిత్తశుద్ధి వుండాలి. చిత్తశుద్ధి కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల ప్రయత్నానికి అన్ని వర్గాల నుంచీ మద్దతు లభించాలి.
Also Read: కామంతో కళ్ళు మూసుకుపోయిన స్టూడెంట్స్.!
‘సీజ్ ది షిప్’ అంటే ఉలిక్కి పడ్డ ఓ వర్గం, ‘ఎర్ర చందనం చెట్లు నరికితే, ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం’ అని హెచ్చరించగానే ఆందోళన చెందడంలో వింతేమీ లేదు.
రాజకీయాల్ని శాసించగలిగే శక్తి వున్న ‘ఎర్ర చందనం మాఫియా’ని ఉక్కుపాదంతో అణచివేయాలంటే, పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడితోనే అది సాధ్యం.
