Table of Contents
Pawan Kalyan School Library.. స్కూళ్ళు మానిపించేసి, బస్సుల్లో విద్యార్థినీ విద్యార్థుల్ని బహిరంగ సభలకి తరలించాలి. అంతేగానీ, స్కూళ్ళకి వెళ్ళి.. వారికి లైబ్రరీని డొనేట్ చేస్తానని చెబితే ఎలా.?
గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓ బహిరంగ సభలో ‘కార్లు, పెళ్ళాలు..’ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
‘దత్త పుత్రుడు.. మూడు మూడు పెళ్ళిళ్ళు.. ప్యాకేజీ స్టార్.. కార్లు, పెళ్ళాలు..’ ఇలా చెలరేగిపోయారు వైఎస్ జగన్, ఆ బహిరంగ సభలో. కట్ చేస్తే, ఆ బహిరంగ సభకు హాజరైంది విద్యార్థినీ విద్యార్థులు.
‘జగన్ మామయ్యా..’ అంటూ ప్లకార్డులు తయారు చేయించి, పిల్లలకు ఇష్టం లేకపోయినా, వారిచేత ఆ ప్లకార్డుల్ని పట్టుకునేలా చేశారు.
అందుకే.. బెంగళూరులో జగన్ తలదాచుకోవాల్సి వచ్చింది..
అంతేనా, జగన్ కోసం పాటలు తయారు చేయించి, ఆ విద్యార్థినీ విద్యార్థులతో బలవంతంగా పాడించారు. అందుకే, రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయింది వైసీపీకి.
ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్, బెంగళూరులో తలదాచుకుంటున్నారు.. అప్పుడప్పుడూ, తాడేపల్లిలో తన ఇంటికి వచ్చి పోతున్నారంతే.

అసలు విషయంలోకి వస్తే, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.
ఈ కార్యక్రమంలో భాగంగా, చిలకలూరిపేటలోని ఓ స్కూలుని సందర్శించారు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలేమీ చేయలేదు జనసేనాని.
రాజకీయ నాయకుల బూతులు వినొద్దు..
‘రాజకీయ నాయకులు మాట్లాడే బూతుల్ని టీవీల్లో కూడా వినొద్దు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి..’ అంటూ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
‘సినిమా అనేది చిన్న వినోదం మాత్రమే.. స్కూళ్ళకు స్థలాలనిచ్చే దాతల్ని గుర్తు చేసుకోండి.. గొప్ప గొప్పవారి చరిత్రల గురించి తెలుసుకోండి..’ అని పవన్ కళ్యాణ్ విద్యార్థులతో చెప్పారు.

అంతే కాదు, ఆ స్కూల్ లైబ్రరీ గురించి మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైనన్ని పుస్తకాలు, కంప్యూటర్లు లేవన్న విషయాన్ని తాను గుర్తించానని పవన్ కళ్యాణ్ అన్నారు.
సరిపడా పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో వుండేలా చేస్తాననీ, కంప్యూటర్లు కూడా డొనేట్ చేస్తానని పవన్ కళ్యాణ్, వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు.
Pawan Kalyan School Library.. నేను స్కూల్ నడిపితే ఎలా వుంటుందో.. అలా
‘నేను స్కూల్ నడిపితే ఎలా వుంటుందో.. అలా లైబ్రరీని తీర్చిదిద్దుతా..’ అని పవన్ కళ్యాణ్, విద్యార్థులతో చెప్పడం గమనార్హం.
ఇంతకంటే గొప్ప నాయకుడు ఎక్కడ దొరుకుతాడు.? అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులూ అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెబుతూ.

‘ఇంట్లో ఇద్దరు పిల్లల్ని భరించడం కష్టం. స్కూళ్ళో చాలామంది పిల్లల్ని ఉపాధ్యాయులు డీల్ చేస్తుంటారు. వారిని గౌరవించడం అలవాటు చేసుకోండి..’ అని విద్యార్థులకు పవన్ కళ్యాణ్ చేసిన సూచన, ఉపాధ్యాయ వర్గాల్లోనూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఓ స్కూల్ విద్యార్థులు, తమకు ప్లే గ్రౌండ్ లేదని పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావిస్తే, వ్యక్తిగతంగా లక్షలు వెచ్చించి, ఓ స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చిన సంగతి తెలిసిందే.
