Appu Ratna AP CM సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా రాజకీయ విమర్శలు చేయడం కొత్తేమీ కాదు.
నిజానికి, సినిమా సంబంధిత విషయాలేవీ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కనిపించవు.
అసలు విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘అప్పు రత్న’ అనే బిరుదునిచ్చారు జనసేన అధినేత సోషల్ మీడియా వేదికగా.
Appu Ratna AP CM అప్పు రత్న.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..
సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందికి తాను చెప్పదలచుకున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలనుకోవడం జనసేన అధినేత ఉద్దేశ్యం.
మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు..
రాష్ట్ర సంపద, అభివృద్ధి కుక్కల పాలైపోనీయండి..
మీ సంపద, అభివృద్ధికి మాత్రం ముప్పు రానీయొద్దు..
PawanKalyan
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు, ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభకాంక్షలు..
ఓ బహిరంగ సభ వేదికగా చెప్పే విషయం.. తెలుగు మీడియా ద్వారా జనాల్లోకి వెళ్ళడమన్నది జనసేన పార్టీకి ఒకింత కష్టమవుతోంది.
తెలుగు మీడియా నుంచి జనసేన పార్టీకి కనీస స్థాయిలో కూడా సహాయ సహకారాలు అందడంలేదు. తెలుగు మీడియా తన బాధ్యతల్ని పూర్తిగా విస్మరిస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
అప్పుల్లో ఆంధ్రప్రదేశ్..
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది. అప్పటినుంచి.. అప్పులు నానాటికీ పెరుగుతూనే వున్నాయి.
అప్పులతోపాటే అభివృద్ధీ.. అంటే అది వేరే చర్చ. సంక్షేమం పేరుతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమవుతూ.. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారన్నది జనసేన ఆరోపణ.
‘చంద్రబాబు (Nara Chandrababu Naidu) హయాంలోనూ అప్పులు జరిగాయ్.. మా హయాంలోనూ అప్పులు జరుగుతున్నాయ్..’ అని వైసీపీ అంటోంది.

కానీ, చంద్రబాబు (TDP Government) పాలనలో అప్పుల్ని తప్పు పట్టిన వైసీపీ, ఇప్పుడు అంతకు మించి అప్పులు ఎలా చేయగలుగుతోంది.? అన్నదే ప్రశ్న ఇక్కడ.
Also Read: సినిమాల వల్ల జనం చెడిపోతారా.? బాగుపడతారా.?
జనసేనాని (Janasenani Pawan Kalyan) ట్వీటులోనే దాదాపుగా చెప్పాలనుకున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పేశారు. ఈ ట్వీట్.. అలాగే ఆ హ్యాష్ ట్యాగ్ (AppuRatnaAPCM).. వైరల్ అవుతోంది.