Pawan Kalyan Stop Fan Wars.. అభిమానం ముసుగులో సోషల్ మీడియా వేదికగా జరిపే ఫ్యాన్ వార్స్ ఆపెయ్యాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
జన సేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన తాజా చిత్రం ‘ఓజీ’ సక్సెస్ ఫంక్షన్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నేను అందరు హీరోల సినిమాలూ చూస్తాను. అభిమానం ముసుగులో, ఫ్యాన్ వార్స్ సబబు కాదు. సినిమా కోసం అందరం చాలా కష్టపడతాం’ అని చెప్పారు పవన్ కళ్యాణ్.
కులం, మతం, ప్రాంతం.. వీటికి అతీతంగా ‘కళ’ని చూడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
‘ప్రకాష్ రాజ్‌తో రాజకీయంగా విభేదాలుండొచ్చు. కానీ, సినిమా మమ్మల్ని కలుపుతుంది’ అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Stop Fan Wars.. అందరి సినిమాలూ చూద్దాం.. అందర్నీ అభిమానిద్దాం..
‘జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. అందరూ సినిమా కోసం కష్టపడతారు. అందరి సినిమాలూ చూద్దాం.. అందర్నీ ఆదరిద్దాం’ అని ‘ఓజీ’ సక్సెస్ వేదికపైనుంచి పిలుపునిచ్చారు జనసేనాని.
నిజానికి, ఇలా సినీ హీరోలంతా తమ అభిమానులకు పిలుపునిస్తే, అసలంటూ ఫ్యాన్ వార్స్ అనేవే వుండవు. ఇదేమీ పవన్ కళ్యాణ్ కొత్తగా చెప్పడంలేదు.
చాలాకాలంగా పవన్ కళ్యాణ్ ఇదే మాట చెబుతూ వస్తున్నారు. అయితే, ఒక్క చేత్తో శబ్దం రాదు కదా.! రెండు చేతులు కలిస్తేనే, శబ్దం.
Also Read: కన్యాకుమారి సమీక్ష.! సిక్కోలు ‘సిన్నది.. సిన్నోడు’ బావున్నారు.!
ఇతర హీరోలు కూడా, తమ అభిమానులకు ఇదే పిలుపునిస్తే, చాలా తక్కువ సమయంలోనే, ఫ్యాన్ వార్స్ ఆగిపోతాయి. సినీ పరిశ్రమ బాగు పడుతుంది.
ఒకప్పుడు వంద రోజుల ఫంక్షన్లు జరిగేవి. ఏళ్ళ తరబడి థియేటర్లలో సినిమాలు ప్రదర్శితమైన సందర్భాలూ గతంలో వుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
రెండు మూడు రోజుల సినిమా అయిపోయింది.! సినిమా ఎక్కువ రోజులు ఆడాలంటే, సినిమాని అందరూ అభిమానించాలి. హీరోల అభిమానుల ముసుగులో, ఫ్యాన్ వార్స్ ఆగిపోవాలి.
చూద్దాం.. సినిమా బాగుపడటానికి, మిగతా హీరోలంతా పవన్ కళ్యాణ్ మాటలతో ఏకీభవించి, ఆయన్ని గౌరవించి.. తమ అభిమానులు ఫ్యాన్ వార్స్ మానెయ్యాలని పిలుపునిస్తారో లేదో.!
