Table of Contents
Pawan Kalyan Telugu Journalism.. జర్నలిజం ఎక్కడుంది.? ఇప్పుడంతా ఎర్నలిజమే కదా.! ఔను, ఒకప్పుడు సామాజిక బాధ్యతతో జర్నలిజం రంగం వైపు వచ్చేవాళ్ళు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.
తెలుగు మీడియా కాస్తా ఎప్పుడో తెగులు మీడియాగా మారింది. జర్నలిస్టులంటే, బ్లాక్‌మెయిలర్స్ అనే స్థాయికి పరిస్థితి మారిపోయింది.
అందరూ అలా వున్నారని కాదుగానీ, ఆయా మీడియా సంస్థల పుణ్యమా అని జర్నలిస్టుల మీద ఆ ‘మచ్చ’ పడిపోయింది.
మహిళా జర్నలిస్టులు కొట్టుకున్నారు..
కొన్నాళ్ళ క్రితం ఇద్దరు మహిళా జర్నలిస్టులు, సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర తిట్టుకుని, కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోవడం పెను దుమారంగా మారింది.
ఆధిపత్య పోరులో భాగంగా అలా తమ స్థాయిని తామే దిగజార్చేసుకున్నారు ఆ జర్నలిస్టులు.
మీడియా సంస్థల్లో పని చేస్తూ, ఆయా రాజకీయ పార్టీలకు మౌత్ పీసుల్లా జర్నలిస్టులు మారిపోతున్న వైనం అందరికీ తెలిసిందే.
నిజానికి, మీడియా సంస్థలే అమ్ముడుపోయాక జర్నలిస్టులు మాత్రం చేయగలిగేదేముంది.? ఆయా పార్టీలు చెప్పినట్లుగానే వార్తల్ని మార్చి ప్రచారం చేయాల్సి వుంటుంది.
Pawan Kalyan Telugu Journalism.. పవన్ కళ్యాణ్.. ది గ్రేట్.!
మీడియా సంస్థల్ని రాజకీయ పార్టీలు బహిష్కరిస్తున్న రోజులివి. టీడీపీ అనుకూల మీడియాని వైసీపీ ఎప్పుడో బ్యాన్ చేసేసింది.
వైసీపీ అనుకూల మీడియాని టీడీపీ కూడా బ్యాన్ చేసేసిన సంగతి తెలిసిందే. ఆయా పార్టీల అధినేతలు, తమకు నచ్చని మీడియా సంస్థల మీదా, జర్నలిస్టుల మీదా విరుచుకుపడుతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలది సైతం ఇదే దారి. జర్నలిస్టుల్ని పార్టీల ప్రతినిథులుగా రాజకీయ నాయకులు చూస్తున్న రోజులివి.
అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం, ‘మీ మీడియా సంస్థ ఏదైనా.. నేను మిమ్మల్ని జర్నలిస్టుగానే చూస్తాను..’ అంటూ తాజాగా, విశాఖపట్నంలో ప్రెస్ మీట్ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఆత్మవిమర్శ చేసుకుంటారా మరి.?
ఈ ఒక్కమాట, మొత్తంగా జర్నలిస్టులందరికీ, చాలా చాలా పెద్ద ఉపశమనంగా మారింది. వాళ్ళంతా ఆత్మవిమర్శ చేసుకోవడానికీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉపయోగపడుతున్నాయి.
‘నిజమే కదా.! జర్నలిజం ఎలా వుండేది.? ఇప్పుడెలా అది ఎర్నలిజంగా మారిపోయింది.?’ అని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: దేశం మనది.. జాతీ మనది.. ఎగురుతున్న జెండా మనదీ.!
ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా వ్యవహరిస్తున్న ఎర్నలిస్టులు, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన వార్తలు చెప్పే క్రమంలో కొన్నిసార్లు వెటకారాలకు కూడా దిగారు ఇప్పటిదాకా.
ఇకపై ఆ పరిస్థితి వుండదా.? అంటే, వుండదని చెప్పలేం.. కాకపోతే, మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది.