Pawan Kalyan Unstoppable.. ఆయనో ప్రముఖ నటుడు అట.! ‘బద్రి’ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేస్తే, దాన్ని చూసేందుకు ఓ ప్రముఖ హీరో కారులో వెళ్ళాడట.!
ఎవరా హీరో.? ఏమా కథ.? ‘జవాన్’ దర్శకుడు బీవీఎస్ రవి (‘మచ్చ రవి’ అంటుంటారు..) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో’కి బీవీఎస్ రవి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan Unstoppable ‘జవాన్’ సినిమాతోనే సరిపెట్టాడు..
బీవీఎస్ రవి, ‘జవాన్’ సినిమాని తెరకెక్కించాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా అది. మెహ్రీన్ పిర్జాదా కథానాయిక. ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
పవన్ కళ్యాణ్ రేంజ్.. వేరే లెవల్.! ఆయన క్రేజ్ ఎవ్వరికీ రాదు.! పోస్టర్లు, టీజర్లు కాదు.. మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్ రాబోతోంది.!
BVS Ravi
‘జవాన్’ తర్వాత మళ్ళీ దర్శకత్వం వైపు పెద్దగా చూడలేదు రవి. అయితే, రచయితగా తన జర్నీ కొనసాగిస్తున్నాడు.
‘బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ పవన్ కళ్యాణ్’ ఎపిసోడ్ తాలూకు టీజర్ ఏమంత గొప్పగా లేదన్న ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చిన, ‘మచ్చ’ రవి.. పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఎవరా ప్రముఖ హీరో.!
‘‘పేరు చెప్పనుగానీ.. ఓ గొప్ప నటుడు, ‘బద్రి’ సినిమా పోస్టర్ చూసేందుకు వెళ్ళి, అక్కడ గుమికూడిన పవన్ కళ్యాణ్ అభిమానుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విషయం నాతో చెప్పాడు..’ అని రవి చెప్పుకొచ్చాడు.
‘పవన్ కళ్యాణ్ క్రేజ్ మాకు ఎప్పటికీ రాదు..’ అంటూ ఆ హీరో అన్నాడట. కానీ, ఆ హీరో ఎవరన్నది మాత్రం రవి చెప్పలేదు. రవి వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: Nithya Menen.. టీచరమ్మ పాఠం.. వాళ్ళకి గుణపాఠం.!
‘అన్‌స్టాపబుల్ పవన్ కళ్యాణ్’ ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అవుతుందనీ, అన్‌స్టాపబుల్ చరిత్రలో ఇలాంటి ఎపిసోడ్ ఇంకోటి వుండకపోవచ్చని చెప్పాడాయన.
నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం చాలా చాలా అరుదు. నానా రకాల రాజకీయ రచ్చా జరుగుతోంది ఈ ఇద్దరి ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో విషయంలో.

సినిమాలే కాదు, రాజకీయ అంశాలూ ఈ వేదికపై చర్చకు వచ్చాయ్. బాలయ్య సంధించే ప్రశ్నలు, పవన్ కళ్యాణ్ పేల్చే తూటాల్లాంటి సమాధానాలు.. వీటి కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
ఈ హై ఓల్టేజ్ ఎపిసోడ్‌ని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ‘ఆహా’.! అతి త్వరలో ఈ ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి.
టీజర్ నిరాశపర్చినా, ఫైనల్ ఎపిసోడ్స్ మాత్రం సగటు సినీ అభిమానినీ, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజల్నీ విశేషంగా అలరిస్తాయంటున్నాడు ‘మచ్చ’ రవి.!
ఆ సెన్సేషనల్ ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయోగానీ.. ఈలోగా నరాలు తెగే ఉత్కంఠను భరించడం అటు బాలయ్య అభిమానులకీ, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులకీ అంత తేలిక కాదు.