జనసేన అధినేత Pawan Kalyan ‘వారాహి’ అనే పేరుతో ఓ వాహనాన్ని పరిచయం చేశారు.
ఓ వాహనాన్ని కొనుగోలు చేసి, తన రాజకీయ అవసరాల నిమిత్తం ప్రత్యేకమైన మార్పులు చేయించి, దానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ఎన్నికల ప్రచారం కోసం కావొచ్చు.. రాజకీయ యాత్రల కోసం కావొచ్చు.. కారణమేదైతేనేం, ఇదొక కారవాన్ లాంటిది.. కార్యాలయం లాంటిది.. ప్రచార రధం లాంటిది కూడా.!
ఆలివ్ గ్రీన్ కలర్ చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. మిలిటరీ వాహనాలకు మాత్రమే ఈ రంగుని వినియోగిస్తారు. ఈ రంగు విషయమై స్పష్టమైన నిబంధనలూ వున్నాయ్.
రంగు చుట్టూ అంత వివాదం అవసరమా.?
రోడ్లపై చాలా వాహనాలు ఆలివ్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంటాయి. అయితే, ఆర్మీ వాహనాలతో పోల్చితే చిన్న చిన్న మార్పులుంటాయ్ ఆ ‘ఆలివ్ గ్రీన్’కి.
సో, ‘వారాహి’ వాహనానికి సంబంధించి కూడా రంగు విషయమై చిన్న చిన్న మార్పులు వుండొచ్చుగాక.
గతంలో జనసేన పార్టీ కోసం స్కార్పియో వాహనాల్ని జనసేనాని కొనుగోలు చేస్తే, వాటిపైనా పెద్ద వివాదమే నడిచింది.
జనసేనాని Pawan Kalyan ఏం చేసినా అది సంచనలమే..
ఔను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే. ఎందుకో ఓ వర్గం మీడియా ఈ విషయమై అత్యుత్సాహం చూపుతుంటుంది.
పేటీఎం కూలీల సంగతి సరే సరి.! జనసేనాని రధం ‘వారాహి’ మీద వున్న ఫోకస్‌లో పదోవంతు అయినా, రాష్ట్ర రాజధాని విషయంలో వుంటే ఎంత బావుంటుందో కదా.!
Also Read: మెగాస్టార్ చిరంజీవికి అవార్డొస్తే.. వాళ్ళకి ఏడుపొస్తుంది.!
అన్నట్టు, త్వరలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనల నిమిత్తం, ఈ ‘వారాహి’ వాహనాన్ని రూపొందించారు.
వాహనం రోడ్డెక్కాలంటే, రవాణా శాఖ నుంచి అనుమతులు తప్పనిసరి. ఆ అనుమతులు లభించాక, వివాదాలకు ఆస్కారమేముంటుంది.?
అయినా, ఆర్మీ సంక్షేమం కోసం 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన పవన్ కళ్యాణ్, ‘వారాహి’ విషయంలో నిబంధనల్ని ఉల్లంఘిస్తారా.? నాన్సెన్స్ అనిపించడంలేదా.. ఆరోపణలు చేసేవారికి.?