Pawankalyan Rakul Preet Song.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ మూవీ ‘బ్రో’కి సంబంధించి ఓ స్పెషల్ గాసిప్ చక్కర్లు కొడుతోంది.
తెలుగు రీమేక్‌లో భాగంగా చేసిన మార్పుల్లో ఈ సినిమాకి స్సెషల్ సాంగ్ గ్లామర్ అద్దబోతున్నారట.
అయితే, ఆ స్పెషల్ సాంగ్‌లో నటించేదెవరు.? అనేదే ఇక్కడ చర్చ. ఓ స్టార్ హీరోయిన్ ఈ సాంగ్‌లో నటించబోతోందనే టాక్ బయటికి వచ్చింది.
ఆమె ఎవరో కాదు. రకుల్ ప్రీత్ సింగ్ అట. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు మెగా హీరోలతో ఒకేసారి డాన్స్ చేసే ఛాన్స్ వచ్చేసరికి రకుల్ ఎగిరి గంతేసిందట.
Pawankalyan Rakul Preet Song.. రకుల్‌ని ఎందుకు టార్గెట్ చేశారబ్బా.!
అయితే, లాస్ట్ మినిట్‌లో డేట్స్ అడ్జస్ట్ కావడం లేదనీ చేతులెత్తేసిందట.. దాంతో, రకుల్ ఈ స్పెషల్ సాంగ్ చేస్తుందా.? లేదా.? అనే డైలమాలో ‘బ్రో’ టీమ్ వుందట..
ఇదీ ఈ సినిమాకి సంబంధించిన గాసిప్. అయితే, నిజంగానే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ వుందా.? ఒకవేళ వుంటే ఆ సాంగ్‌లో రకుల్ నటిస్తోందా.? అనే సంగతి పక్కన పెడితే,

ఆలు లేదూ చూలూ లేదు.. అదేదో అన్నట్లుగా ఈ గాలి వార్తలను రోజుకో రకంగా తిప్పి తిప్పి వేడిగా వడ్డించేయడం హాస్యాస్పదం.
Also Read: Iswarya Menon: నిఖిల్ సిద్దార్ధ ఎంత మంచోడంటే.!
రేపో మాపో ఈ విషయమై చిత్ర యూనిట్ అధికారికంగా ఓ ప్రకటన చేసేందుకు సిద్ధంగా వుంది. అయితే, ఈ లోపలే గాలి వార్తదారులకు కడుపుబ్బరం ఆగట్లేదు కాబోలు.
రోజుకో పుకారు పుట్టించి అలా చేస్తోందట. ఇలా చేస్తోందట.. అంటూ పాపం రకుల్‌తో ఆటాడేసుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా వున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్‌లో చేతి నిండా ప్రాజెక్టులతో చాలా చాలా బిజీగా గడుపుతోంది. ఈ టైమ్‌లో ఆమెనిలా రచ్చకీడ్చడం తగునా.? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.