Pawankalyan Zero Budget Politics.. రాజకీయం అంటే సేవ.. కానీ, అది ఒకప్పుడు.! రాజకీయం అంటే ఇప్పుడు కేవలం వ్యాపారం మాత్రమే.!
వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే.. అది అంత తేలికైన వ్యవహారం కాదు.! మార్పు అసాధ్యమేమీ కాదు.. కాకపోతే కష్టమంతే. ప్రయత్నించాలి.. ఈ క్రమంలో చాలా చాలా కష్టపడాలి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan), రాజకీయాల్లో మార్పుని ఆశిస్తున్నారు. ఆ దిశగా బలమైన ముందడుగు వేశారు.
ఓడిపోయారు.. అవమానాలు ఎదుర్కొన్నారు.. అయినా, బలంగా నిలబడేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. ఎప్పుడో ఒకప్పుడు మార్పు వచ్చి తీరుతుందుని ఆయన ఇంకా ఇంకా బలంగా విశ్వసిస్తున్నారు.
Pawankalyan Zero Budget Politics.. ఓట్లు కొనడం ఎలా.?
ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలనగానే ఓట్లు కొనడం ఎలా.? అన్న అంశంపై ఫోకస్ పెట్టాయి. జనసేనాని మాత్రం, ఓటర్లను గెలిపించడం ఎలా.? అని ఆలోచిస్తున్నారు.
అసలంటూ రాజకీయ అవినీతిలో ప్రజలూ భాగస్వాములైనప్పుడు, మార్పు ఎలా సాధ్యం.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.

కానీ, రాజకీయ అవినీతిలో ప్రజలు భాగమవుతున్నారు.. ఆ ప్రజలే బాధితులుగానూ వున్నారు. అదే సమస్య. కాబట్టి, ఖచ్చితంగా ప్రజలు రాజకీయ అవినీతి నుంచి బయటకు రావాలి.
కేంద్ర ఎన్నికల సంఘమే, అసెంబ్లీ అలాగే లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థులు ఎన్నికల కోసం ఫలానా మొత్తం ఖర్చు చేయాలని చెబుతోందాయె.
ఎన్నికల వ్యయం.. అంటే, దాన్ని అభ్యర్థులు ఖచ్చితంగా తిరిగి రాబట్టుకోవాలి కదా.! అవినీతి ఇక్కడినుంచే విస్తరిస్తోంది. అధికారిక వ్యయం, అనధికారిక వ్యయం.. వీటికి అస్సలు పొంతన వుండదు.
భోజనాలైనా పెట్టాలి కదా..
నిజానికి, జనసేన (Jana Sena Party) చాలా చాలా పేద పార్టీ.. ప్రస్తుతం వున్న ప్రధాన రాజకీయ పార్టీలతో పోల్చితే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే, ఆ పార్టీకి వున్న ప్రధాన ఆదాయ వనరు.
డబ్బు కోసం రాజకీయాలు చేసేవాళ్ళని జనసేనాని ప్రోత్సహించరు. జనసైనికులు, సమాజంలో మార్పు కోసం జనసేనానితో ముందడుగు వేసే నాయకులు మాత్రమే ఎంతో కొంత జనసేన కోసం ఖర్చు చేస్తారు.
పవన్ కళ్యాణ్‌కి వున్న ఫేమ్ చూసి, ఎలాగోలా జనసేన నుంచి టిక్కెట్ తెచ్చుకుని గెలిచేద్దామనుకునే ఆశతో వున్నోళ్ళు, జనసైనికుల భుజాల మీద చేరబడిపోతుంటారు.

అలాంటి వాళ్ళ గురించే జనసేనాని మాట్లాడుతూ, ‘కార్యకర్తలకి బోజనాలైనా పెట్టాలి కదా.! రాజకీయ అవినీతి లేని ఎన్నికలు.. అనే అందమైన అబద్ధంలో బతికేస్తున్నాం..’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యర్థి పార్టీలు ఓటుకి పది నుంచి పదిహేను వేలైనా ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్న దరిమిలా, జనసేన పార్టీ నిబంధనలకు లోబడి అయినా ఎన్నికల వ్యయం చేయాలి కదా.? ఇదే జనసేనాని చెప్పింది.
ఓట్లను కొనమని జనసేనాని ఏనాడూ చెప్పరు. చెప్పరుగాక చెప్పరు.! ఆయన చెప్పింది చాలామందికి అర్థమవదు.. అర్థమయినా అర్థం కాకపోయినా వక్రీకరణలైతే మామూలే.!