Table of Contents
Payal Rajput అందమైన భామల హాట్ హాట్ ఫొటో షూట్ల సందర్భంగా కొన్ని అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. అనుకోకుండా జరిగే పొరపాట్లు నటీమణులకు తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం, వాటిని ఇంకాస్త మార్ఫింగ్ చేసి.. అసభ్య వీడియోలుగా కొందరు సర్క్యులేట్ చేయడం సోషల్ మీడియా యుగంలో సర్వసాధారణం.
కొన్ని ఇష్యూస్ కావాలనే సెలబ్రిటీలు ఎంకరేజ్ చేసి, మరీ వైరల్ చేయించుకుంటుంటారు.. మరికొన్నిపొరపాటుగా జరుగుతుంటాయనే ఓ వాదన ఉంది ఈ వివాదంలో. ఇకపోతే, తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేం పాయల్ రాజ్‌పుత్ లేటెస్టుగా ఇలాంటి ఓ వైరల్ వీడియోకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.
Payal Rajput అలా డిసైడయిపోయిందట
ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయ్యింది.. వివాదాస్పదమూ అయ్యింది. ఓ ఫోటో షూట్ సందర్భంగా తీసిన వీడియోలో ఆమె ఎక్స్‌పోజింగ్ శృతి మించింది. హద్దులు దాటిన ఆ ముద్దుగుమ్మ అందాల దాడి నెట్టింట రచ్చ రచ్చ చేసింది. దాంతో, ఈ వ్యవహారంపై ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఈ ఇష్యూ కారణంగా కుటుంబ సభ్యులు పాయల్‌ను సినిమాలు మానెయ్యమన్నారట. దాంతో చాలా టెన్షన్ పడిందట పాయల్ రాజ్‌పుత్. తర్వాత ధైర్యం తెచ్చుకుందట. మొదట సోషల్ మీడియాకి దూరంగా వుండాలనీ డిసైడ్ అయ్యిందట. అది సాధ్యమయ్యేదేనా.?
ఆ తప్పెలా జరిగింది చెప్మా.?
అసలు తప్పు ఎలా జరిగిందని ఆలోచించి, ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చిందట. ఆలోచిస్తే, చివరికి తాను పోస్ట్ చేసిన వీడియోలో ఎలాంటి అసభ్యత లేదని స్పష్టం చేసింది పాయల్ రాజ్ పుత్.
Also Read: Niharika Konidela అందుకే సినిమాలు మానేసిందా.?
అంతే కాదు, ‘మహిళలకు లేనివి నాకు ఏమైనా కొత్తగా వున్నాయా.?’ అంటూ బోల్డ్ క్వశ్చన్ కూడా వేసేసింది. నటీమణుల్ని ట్రోల్ చేయడం ఓ సరదాగా కొందరికి మారిపోయిందనీ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలాగే వెకిలితనం ప్రదర్శిస్తారా.? అని పాయల్ ప్రశ్నించింది.
ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టు..
మనలో మన మాట.. ఇలాంటి ఇష్యూస్‌తో ఒక్క దెబ్బకు రెండు పిట్టలే సెలబ్రిటీలకు. ఓ వైపు ఫ్రీ పబ్లిసిటీ. మరోవైపు ఫ్రీ సింపథీ. గతంలో త్రిష, అనుష్క, హన్సిక, నయనతార, అక్షర హాసన్ తదితర ముద్దుగుమ్మలూ ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు.
ఇష్యూలో సీరియస్‌నెస్ బట్టి కొందరు కోర్టుకెక్కారు కూడా. ఇంకొందరైతే లైట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు అల్లరి పిల్ల పాయల్ రాజ్‌పుత్ కాస్త తెలివిగా ఆలోచించి, ఈ సిట్యువేషన్‌ని బాగానే క్యాష్ చేసుకుంది మరి.