Payal Rajput Rakshana 5Ws.. హీరోయిన్లకి పాత సినిమాలు మెడకి చుట్టుకోవడం అనేది కొత్త వ్యవహారం కాదు.! కొందరు హీరోలు కూడా ఇలా తమ పాత సినిమాలకు బాధితులుగానే మారిపోతుంటారు.
కొన్నాళ్ళ క్రితం విజయ్ దేవరకొండకి అలాగే తాను నటించిన ఓ పాత సినిమా ఇబ్బంది పెట్టింది. హీరోలకి ఇలాంటి ‘పాత గాయాలు’ చాలా అరుదు.
కాకపోతే, హీరోయిన్లకే అది పెద్ద సమస్యగా మారుతుంటుంది. నటి పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కొన్నేళ్ళ క్రితం ఓ సినిమాలో నటించింది.
Payal Rajput Rakshana 5Wsపాపం పాయల్.. రక్షణ కావాలంటోంది.!
‘రక్షణ’ పేరుతో ఆ సినిమా తెరకెక్కిందట. ఆ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆలస్యమయ్యింది. టైటిల్ కూడా మారిందిట.
కొత్త టైటిల్‌తో సినిమాని రిలీజ్ చేయడానికి, ఆ సినిమా టీమ్ ప్రయత్నిస్తోంది. పాయల్ రాజ్‌పుత్‌ని సినిమా ప్రమోషన్స్ కోసం పిలుస్తోందిట ఆ టీమ్.

అయితే, సినిమాకి సంబంధించి పాయల్ రాజ్‌పుత్‌కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌లో కొంత అమౌంట్ ఎగ్గొట్టిందట ఆ సినిమా బృందం.
పైగా, తాను సినిమా ప్రమోషన్లకు వచ్చేందుకు వీలు కాని సమయాన్ని సినిమా టీమ్ అడుగుతోందని వాపోతోంది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).
బెదిరిస్తున్నారట..
తన సమస్యని ఆ చిత్ర టీమ్‌కి చెప్పినా, పట్టించుకోకుండా తనను బూతులు తిడుతున్నారనీ, బెదిరిస్తున్నారనీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
Also Read: Mehreen Pirzada Egg Freezing: ఫ్రీజింగ్ ఎగ్స్ గోలేంటి.?
తనకు ఇప్పుడున్న ఫేమ్‌ని వాడుకుని ఆ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారన్నది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) వాదన.

అభిమానులైతే పాయల్‌ని వెనకేసుకొస్తున్నారు. కానీ, సినీ పరిశ్రమ నుంచి ఆమెకు తగిన మద్దతు లభిస్తుందా.? ఇంతకీ, ఆ సినిమా నిర్మాతల వెర్షన్ ఏంటి.?
ఏమోగానీ, పాయల్ రాజ్‌పుత్ ఇలా తన పాత గాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేయడంతో, సదరు సినిమాకి ఒకింత ప్రీ రిలీజ్ బజ్ దొరుకుతోంది.