Payal Rajput Requests Kantara.. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత కథల ఎంపికలో పొరపాట్లే చేసిందో, చేసిన సినిమాలు కలిసి రాలేదో.. కారణం ఏదైతేనేం, రేసులో కాస్త వెనుకబడింది.
స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), ఇంకా ఆ స్థాయిని అందుకోలేకపోతోంది.! అయినాగానీ, పాయల్ రాజ్‌పుత్‌కి అవకాశాలైతే బాగానే వస్తున్నాయ్.
Payal Rajput Requests Kantara.. ‘కాంతార’ టీమ్ పిలుస్తుందా.?
సంచలన విజయాన్ని అందుకున్న ‘కాంతార’ సినిమాకి కొనసాగింపు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఔత్సాహిక నటీనటుల్ని ఆహ్వానిస్తూ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసింది ‘కాంతార’ టీమ్.

సోషల్ మీడియా వేదికగా ‘కాంతార’ టీమ్ విడుదల చేసిన ప్రకటన నేపథ్యంలో, పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కూడా ఆ టీమ్‌కి ఓ రిక్వెస్ట్ పంపింది.
తన పేరునీ పరిశీలించాలనీ, ఆడిషన్స్ కోసం తాను వస్తాననీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ పంపడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.
ఈ విషయంలో పాయల్‌ని చాలామంది అభినందిస్తున్నారు కూడా.!
పాయల్ సమ్‌థింగ్ వెరీ స్పెషల్..
సాధారణంగా ఇలాంటి కాస్టింగ్ కాల్స్‌ని నటీనటులు లైట్ తీసుకుంటారు. ‘రిక్వెస్ట్’ పంపితే, చిన్నతనం అనే భావనలో వుంటారు కొందరు.

కానీ, పాయల్ రాజ్‌పుత్ అస్సలేమాత్రం మొహమాటపడలేదు. ఈ విషయంలో పాయల్ రాజ్‌పుత్‌ని అభినందించి తీరాల్సిందే.
Also Read: మహేష్‌బాబుని ‘డెవిల్’లా చూడగలమా.?
‘కాంతర’ లాంటి సినిమాలో లీడ్ క్యారెక్టర్ వచ్చినా తగిన న్యాయం చేయగల కేపబిలిటీ నటిగా పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)కి వుంది.
మరి, ‘కాంతార’ (Kantara Movie) టీమ్, పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) రిక్వెస్ట్‌ని ఎలా పరిగణిస్తుందో వేచి చూడాల్సిందే.
గ్లామరస్ రోల్స్ మాత్రమే కాదు, ‘మంగళవారం’ తదితర సినిమాలో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లోనూ మెప్పించింది పాయల్ రాజ్‌పుత్.