Polavaram Political Project అదిగదిగో పోలవరం ప్రాజెక్టు.! ఒకప్పుడు ఏమీ లేనప్పుడు.. ఇసుక తిన్నెల్లో.. ‘ఇక్కడే పోలవరం ప్రాజెక్టు రాబోతోందిట..’ అని అనుకునేటోళ్ళు.!
ఇప్పుడైతే, అక్కడ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణాలు కనిపిస్తాయ్.! స్పిల్ వే పనులు దాదాపు పూర్తయిపోయాయ్. గేట్లు కూడా బిగించేశారు.!
పోలవరం అంటే.. బహుళార్దసాధక ప్రాజెక్టు.! తాగు నీరు, సాగు నీరు మాత్రమే కాదు, జల విద్యుత్తునీ అందించే ప్రాజెక్టు ఇది.!
Polavaram Political Project దేశంలోనే చాలా చాలా ప్రత్యేకమైనదట.!
అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని.! ఇదీ, పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.!
ఎప్పుడో బ్రిటిష్ హయాంలో పోలవరం ప్రాజెక్టు గురించి సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. అప్పటినుంచి ఇప్పటిదాకా.. ఇన్ని దశాబ్దాల కాలంలో.. ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు.?

ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు.! రాజకీయ గ్రహణం పోలవరం ప్రాజెక్టుని పట్టి పీడిస్తోంది. అదే పెద్ద శాపం.!
ఎవరో ప్రారంభించారు.. ఇంకెవరో పూర్తి చేస్తారు.!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ముందే పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది. బోల్డంతమంది ముఖ్యమంత్రులు మారారు.
ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదంటే, జాతీయ ప్రాజెక్టు అయినా ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆవసోపాలు పడుతోందంటే.. ఎంతటి నిర్లక్ష్యం ఇందులో దాగుందో అర్థం చేసుకోవచ్చు.
‘మా నాన్న ప్రారంభించారు.. నేను పూర్తి చేస్తాను..’ అంటున్నారొకాయన.! పోలవరం ప్రాజెక్టు.. అంటే, ఇది దేశ ప్రజల ఆస్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవ నాడి.
Also Read: 300 మంది బలి: రైలూ.. రైలూ.. నిన్నెవరు ‘దెబ్బ’తీశారు.?
ఓ ముఖ్యమంత్రి సొంత ఇల్లు కాదు.. ఇంకొకాయన సొంత ఆస్తి కాదు.! రాజకీయ నాయకులు సిగ్గొదిలేశారు.. అనడానికి పోలవరం ప్రాజెక్టు ఓ ప్రత్యక్ష నిదర్శనం.
ప్రజాధనంతో సొంత పబ్లిసిటీలు చేసుకుంటారుగానీ, ప్రజాధనంతో ప్రాజెక్టులు పూర్తి చేయలేరు. ఎందుకని.? జనం నిలదీస్తారన్న భయం లేకపోవడం వల్లేనా.?
ప్రత్యేక విమానాల్లో తిరుగుళ్ళు.. అత్యాధునిక వాహనాలతో కాన్వాయ్‌లు.. ప్రజాధనంతో సొంత పబ్లిసిటీ.. ఇవన్నీ అధికారంలో వున్నోళ్ళు మానేసుకోగలిగితే.. పోలవరం ఎప్పుడో పూర్తయిపోయి వుండేది.!
ఆ పార్టీ.. ఈ పార్టీ.. ఆ ముఖ్యమంత్రి.. ఈ ముఖ్యమంత్రి.. ఆ ప్రధాని.. ఈ ప్రధాని.. అన్న తేడాల్లేవ్.. పోలవరం ప్రాజెక్టుకి అందరూ విలన్లే.!