Political Dirty Picture.. రాజకీయ నాయకులు బొత్తిగా సిగ్గొదిలేశారు. ఓ మహిళా నాయకురాలైతే, ‘నన్నేం చేయగలరు.? రేప్ చేసే ధైర్యం ఎవడికైనా వుందా.?’ అంటూ ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపింది.
అరగంట చాలంటాడు ఒకడు.. గంట కావాలంటాడు ఇంకొకడు. మరొకడైతే, తన ‘మగతనాన్ని’ ఎవరికో వడియో కాల్‌లో చూపించేస్తాడు. ఏమన్నా అంటే, బండ బూతులు తిడతాడు.
ఇదీ నేటి రాజకీయం.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అసలు సిగ్గు వుండాల్సింది రాజకీయ నాయకులకు కాదు, దురదృష్టవశాత్తూ.. సిగ్గు పడాల్సింది వాళ్ళని నాయకుల్ని చేసిన ప్రజలే.
పెళ్ళికీ.. ఎన్నికలకీ తేడా తెలియదా.?
పిల్లలకు పెళ్ళి చేయాలనకుంటే, బోల్డంత రీసెర్చ్ చేసేస్తుంటారు తల్లిదండ్రులు. కాబోయే కోడలి విషయంలో అయినా, అల్లుడి విషయంలో అయినా… వాళ్ళ గుణగణాల్ని బేరీజు వేసుకుంటారు.
మరి, ప్రజా ప్రతినిథులు ఎంచుకోవడానికి ఓటర్లెందుకు ఆ గుణగణాల్ని పరిగణనలోకి తీసుకోరు.? ఎందుకంటే, పిల్లలు మన బాధ్యత.. రాష్ట్రమైనా, దేశమైనా.. మన బాధ్యత కాదు, అంతేనా.?
దేశమైనా, రాష్ట్రమైనా నీఛులైన రాజకీయ నాయకుల (Political Leaders) వల్ల నాశనమైతే, అంతిమంగా నష్టపోయేది ప్రజలే. కానీ, ఓటర్లకు ఆ మాత్రం సోయ వుండదు. అసలు బాధ్యత వుండదు.
Political Dirty Picture తప్పెవరిది.? చూపించినోడిదా.? చూసినోడిదా.?
తప్పు చేసినోడు, నిప్పులా తిరుగుతున్నాడు. ఇది తప్పు.. అని చెప్పినోడు భయపడాల్సిన దుస్థితి. ఎందుకంటే, వ్యవస్థలు తప్పుడు మనుషుల కోసం పని చేస్తున్నాయ్.
ఈ వ్యవస్థలు బాగుపడాలంటే, ముందంటూ ప్రజల్లో మార్పు రావాలి. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.?
Also Read: బిచ్చగాడికి బైక్ వుంటే నేరమా అధ్యక్షా.?
సంక్షేమం ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయం.. ప్రజల కళ్ళకు గంతలు కట్టేస్తోంది. ఆపై కులం పేరుతో, మతం పేరుతో నడిచే రాజకీయాలు ప్రజల్ని మరింతగా కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నాయ్.
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? ఔను, రాజకీయ నాయకులెప్పుడో సిగ్గొదిలేశారు. వాళ్ళకి సిగ్గూ ఎగ్గూ (Dirty Politics) నేర్పించాల్సింది ఓటర్లే.. అంటే, ప్రజలే.!