Political Jamakaya.. రాజకీయం వెటకారమైపోయింది.! ఔను, రాజకీయ నాయకులు రాజకీయాన్నే కాదు, వ్యవస్థల్నీ వెటకారం చేసేశారు. ‘సేవ’ అంటే రాజకీయం. కానీ, ఇప్పుడు వెటకారమే రాజకీయం. బాధ్యతారాహిత్యమే రాజకీయం.!
మహిళల భద్రత విషయమై రాజకీయ నాయకులకున్న చిత్తశుద్ధి ఎంత.? అంటే, ఒకడేమో వెనక నుంచి వాటేసుకుంటాడు.. ఇంకొకడేమో ‘అరగంట చాలు’ అంటాడు.. చట్ట సభల సాక్షిగా మహిళల పట్ల జుగుప్సాకరంగా ప్రవర్తిస్తారు ఇంకొందరు.
మీడియా ముందు బూతులు తిట్టే నాయకులు కూడా నీతులు చెబుతారు.. మహిళల భద్రత విషయమై.
ఒకాయన అయితే, ‘నాలాంటి అన్న గనుక.. అత్యాచారం జరిగే సమయంలో మహిళ పక్కన వుంటే.. కోసి కారం పెడతాడు..’ అంటాడు. ఆయన బాధ్యతగల ఓ అమాత్యుడు.
ఇంకెందుకు ఆలస్యం.. మీ పార్టీలోనే చాలామంది వున్నారు కదా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినోళ్ళు.. కోసి కారం పెట్టేసే దమ్ముందా.? అని ప్రశ్నిస్తే, ఏమైపోతాడా అమాత్యుడు.?
Political Jamakaya హహహ.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అని రాజకీయ నాయకుల్ని ఉద్దేశించే అనాలి. లేకపోతే, దోషులెవరో తెలిసినా.. చాలా కేసుల్లో శిక్షలు పడటంలేదు. ఏళ్ళ తరబడి కేసులు సాగుతూ సాగుతూ వున్నాయ్.
జైళ్ళకు వెళ్ళొచ్చినోళ్ళు కీలక పదవుల్లో వుంటే, వ్యవస్థలు ఇలాగే తగలడతాయ్ మరి.! అమాత్యుడు చెబుతున్నది కోసి కారం పెట్టడమంటే, జాంకాయ్ కోసి.. కారం వేసుకుని తినడం అన్నమాట.
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
అంతకన్నా, ప్రజా ప్రతినిథులు కావొచ్చు.. కీలక పదవుల్లో వున్నవారు కావొచ్చు.. ప్రజలకోసం ఇంకేం చేయగలరు.?
అధినేత భజనలో మునిగి తేలడానికే సమయం సరిపోవడంలేదు. అమాత్యులకేమో తన శాఖల మీద కనీసపాటి అవగాహన వుండదాయె.!
ఇందుకే కదా, రాజకీయాలంటే జనానికి ‘చీదర’ పుడుతున్నది.!