Table of Contents
Pooja Hegde Fashion Icon ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం ఆడి పాడింది ముద్దుగుమ్మ పూజా హెగ్దే (Pooja Hegde). ఈ బ్యూటీకి వున్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
పూజా హెగ్దే అంటే ఓ బ్రాండ్.. ఆమె ఓ ట్రెండ్ సెట్టర్.. ఫ్యాషన్ ఐకాన్.. అన్నట్లుగా తన మార్క్ స్టైలింగ్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతోంది.
తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ దాదాపు నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న పూజా హెగ్దే (pooja Hegde) లేటెస్టుగా ఫ్యాషన్ ఐకాన్ అవతారమెత్తింది. కొత్త రకం కాస్ట్యూమ్‌తో సరికొత్తగా మెరిసిపోతోంది. ‘సింగిల్’ కలర్ ప్యాటర్న్‌తో ‘బ్యూటీ’ ఫుల్ అనిపిస్తోంది.
మేడమ్ సార్.. మేడమ్ అంతే..
మోడలింగ్ రంగం నుంచి వచ్చింది కదా.. స్టైలింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వుంటుంది పూజా హెగ్దే. సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా చాలా యాక్టివ్‌గా కనిపించే పూజా హెగ్దే (Pooja Hegde) తన స్టైలింగ్‌తో ఆయా సినిమాల ప్రమోషన్స్‌కీ స్పెషల్ అస్సెట్ అవుతుంది.

ఇక లేటెస్టుగా బుట్టబొమ్మ డ్రస్సింగ్ థీమ్ మతులు పోగొడుతోంది. ‘బుట్టబొమ్మ స్టైలింగ్ సిరీస్’ అనే క్యాప్షన్ పెట్టాలేమో ఈ థీమ్‌కి అనిపించేలా అదిరిపోయే స్టైలింగ్‌తో సోషల్ మీడియాని హీటెక్కించేస్తోంది హాట్ హాట్ జిగేల్ రాణి పూజా హెగ్దే (pooja Hegde).
ఆ మాటకొస్తే, ఏ డ్రస్ వేసినా పూజాహెగ్దేకి ఇట్టే అతికిపోతుంది. ఆమె ఫిజిక్ అలాంటిది మరి. డ్రస్ ఏదైనా స్టైలింగ్ మాత్రం మిస్ కాకుండా చూసుకుంటుంది. అందుకే పూజా హెగ్దేని ‘బుట్టబొమ్మ’ అని ముద్దుగా పిలచుకుంటుంటారు ఫ్యాన్స్.
పూజా హెగ్దే (pooja Hegde) నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పూజా హెగ్దే కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తూ ఫ్యాన్స్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పూజా హెగ్డే కాస్ట్యూమ్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయ్ మరి.
Pooja Hegde Fashion Icon.. సామజవరగమనా.. నీలాంబరి సొగసు చూడతరమా.!
టాప్ టూ బోటమ్ సింగిల్ కలర్ డ్రస్సులో కనిపించి వావ్ అనిపిస్తోంది పూజా హెగ్దే. హై నెక్ ప్యాటర్న్‌తో డిజైన్ చేసిన వైట్, బ్లాక్, రెడ్ హాట్, అండ్ బ్యూటిఫుల్ పర్పుల్.. ఇలా రంగు రంగుల థీమ్‌తో హెయిర్ టు నెయిల్ మ్యాచింగ్‌తో పూజా స్టైలింగ్ సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది.

కాస్ట్యూమ్‌తో పాటు, పూజా హెగ్దే ఆటిట్యూడ్ పోటీ పడుతోంది. అందుకే మేడమ్ సార్.. మేడమ్ అంతే. హ్యాట్సాఫ్ టు పూజా హెగ్దే (pooja Hegde).
ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయ్. మోడల్ పాతదే అయినా, పూజా స్టైలింగ్‌తో ఈ కాస్ట్యూమ్స్‌కి సరికొత్తగా కొత్తదనం అద్దేసింది. ఏ డ్రస్సుకు ఆ డ్రస్సే అన్నట్లుగా డిఫరెంట్ స్టైలింగ్‌తో మెరిసిపోతోంది ఈ జనరేషన్ శ్రీదేవి. దాంతో యూత్ ఈ పిక్స్‌కి ఫిదా అయిపోతున్నారు.
ఇంకెన్ని బ్యూటీ ‘ఫుల్లు’ రంగులో..
ఇప్పటికైతే వైట్, రెడ్, బ్లాక్ అండ్ పర్పుల్ కలర్స్‌లో పిచ్చ రేపుతున్న పూజా హెగ్దే (pooja Hegde), ముందు ముందు ఇంకెన్ని కలర్స్‌లో తన అంద చందాలకు పోత పోస్తుందో అంటూ ఆమె పిక్స్ కోసం నెటిజన్లు కాసుక్కూర్చున్నారంటే అతిశయోక్తి కాదేమో.
Also Read: అనసూయ ‘ఉవాచ’.! హ్యాపీ ఫూల్స్ డే.!
‘రాధే శ్యామ్’ (Radhe Shayam) తో పాటు ‘ఆచార్య’ (Aachaarya) లో రామ్ చరణ్ (Ram Charan)కి జోడీగా నీలాంబరి పాత్రలో పూజా హెగ్దే నటిస్తోంది. అలాగే, ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలోనూ పూజా హెగ్దేనే హీరోయిన్. కోలీవుడ్ విషయానికొస్తే, తమిళ స్టార్ హీరో విజయ్ సరసన బ్యూటీఫుల్ ‘బీస్ట్’గా రాబోతోంది.
హిందీలోనూ పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు పూజా హెగ్దే (pooja Hegde) చేతిలో వున్నాయ్. సినిమాలతో బిజీగా వుంటూనే, ప్రమోషన్స్ పేరు చెప్పి, ప్రకటనల పేరు చెప్పి ఇదిగో ఇలా ‘స్టైలు స్టైలురా.. నాది సూపర్ స్టైలురా..’ అంటూ, సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది స్వీట్ అండ్ క్యూట్ బుట్టబొమ్మ పూజా హెగ్దే.