Pooja Hegde Love Story.. పూజా హెగ్దే ప్రేమ కథ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వినిపిస్తున్నాయి. అసలా ప్రేమ కథ సంగతేంటి.?
సినీ నటి పూజా హెగ్దే, బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు చేసింది.. రాత్రికి రాత్రి గోల్డెన్ లెగ్ అయిపోయింది. అలానే, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో ఐరన్ లెగ్‌గా కూడా మారిపోయింది.

లెగ్ అంటే పూజా హెగ్దే.. పూజా హెగ్దే అంటే లెగ్.! అంతలా, దర్శకులు పూజా హెగ్దే కాళ్ళ మీద ఫోకస్ పెట్టి, ఆమె కాళ్ళ గ్లామర్‌ని పెద్ద తెరపై చూపించేశారు.
గత కొన్నాళ్ళుగా పూజా హెగ్దే, తెలుగు సినీ పరిశ్రమకి కాస్త దూరంగానే వుండిపోవాల్సి వచ్చింది. మళ్ళీ, ఇప్పుడు రీ-ఎంట్రీ తరహాలో, బ్యాక్ టు బ్యాక్ అవకాశాల్ని దక్కించుకుంటోంది.
Pooja Hegde Love Story.. ప్రేమ కథ.. ఎవరితో మేడమ్.?
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పూజా హెగ్దే ఓ యంగ్ హీరో సరసన నటించబోతోందట. అది కూడా ఓ ప్రేమ కథలో.
పూజా హెగ్దేతో ప్రేమ కథ ఏంటి.? అది కూడా, యంగ్ హీరోతో.. అంటూ, కొందరు పెదవి విరుస్తున్నా, ‘ఆమెకేం తక్కువ.?’ అని ప్రశ్నించవారూ లేకపోలేదు.

‘తక్కువని కాదు, అన్నీ ఎక్కువే.. రెమ్యునరేషన్‌తో సహా..’ అన్నది మరికొందరి మాట.! ఏమాటకామాట చెప్పాలంటే, పూాజా హెగ్దే స్క్రీన్ ప్రెజెన్ వేరే లెవల్.
పూజా హెగ్దేకి తెలుగులో ఇంకా మంచి మార్కెట్టే వుంది. కాకపోతే, దర్శక నిర్మాతలే కాస్త వెనకంజ వేస్తూ వచ్చారు ఈ మధ్యకాలంలో ఆమెతో సినిమాలు చేసే విషయంలో.

బాలీవుడ్ ప్రాజెక్టుల్లో బిజీగా వుండడం వల్ల, తెలుగులో కొన్ని సినిమాల్ని తనంతట తానే కాదనుకుంది పూజా హెగ్దే. అందులో, ‘గుంటూరు కారం’ సినిమా కూడా ఒకటి.
Also Read: Touch Me Not Review: సమీక్ష.. బిగుసుకుపోయి, ఓవరాక్షన్ చేసేసి.!
ప్రస్తుతం తమిళ సినిమాలూ కొన్ని చేస్తోంది పూజా హెగ్దే. ఇంతకీ, పూజా హెగ్దే చేస్తోన్న ఆ ప్రేమ కథ ఏంటి.? దర్శకుడెవరు.? నిర్మాత ఎవరు.? కొద్ది రోజులాగితే.. అన్ని వివరాలూ బయటకు వస్తాయ్.