Prabhas About Cinema.. పాన్ ఇండియా సూపర్ స్టార్.. రెబల్ స్టార్.. ఇవన్నీ పక్కన పెడితే, ప్రభాస్ అంటే ‘డార్లింగ్’.! ఔను, ప్రభాస్ అందరికీ డార్లింగ్.!
ప్రభాస్ అభిమానుల పేరుతో సోషల్ మీడియాలో యాగీ జరుగుతుందేమోగానీ, ఏనాడూ ప్రభాస్.. తోటి హీరోల విషయంలో ‘అహంకారం’ ప్రదర్శించలేదు. డౌన్ టు ఎర్త్.. అనే మాటకు నిలువెత్తు నిదర్శనం.
ఎంత ఎదిగినా ఒదిగి వుండడం అనే లక్షణానికి ప్రభాస్‌ని (Rebel Star Prabhas) బ్రాండ్ అంబాసిడర్‌గా భావించేయొచ్చు.
పూజగది.. దేవాలయం.!
ఇంట్లో పూజగది వుంది కదా అని.. దేవాలయానికి వెళ్ళి దేవుడికి పూజించడం మానేస్తామా.? అంటూ ఓటీటీకీ.. సినిమా థియేటర్‌కీ మధ్యనున్న వ్యత్యాసాన్ని చాలా చక్కగా చెప్పాడు ప్రభాస్.
‘సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరై, నిజంగానే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

నిర్మాత స్వప్నని అభినందించడం.. ‘సీతారామం’ మీరో దుల్కర్ సల్మాన్ గురించీ, రష్మిక మండన్న (Rashmika Mandanna) గురించీ.. ప్రభాస్ తనదైన స్టయిల్లో మాట్లాడాడు.
Prabhas About Cinema.. నువ్వు దేవుడివి సామీ..
ప్రభాస్ ఇలా, ‘సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి, ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలకమైన సమస్య పట్ల మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
నిజమే, ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వెళ్ళాలి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ప్రత్యేకం. టిక్కెట్ల ధరల వివాదం కూడా ఇప్పుడు లేదు.
Also Read: రమ్యము.. నరేషము.! ఎంత అ‘పవిత్ర’ము.!
‘థియేటర్లు మాకు దేవాలయాలు..’ అంటూ ప్రభాస్ చెప్పినప్పుడు, అతని మాటల్లో ఆర్ద్రత చాలామందికి కనిపించింది.
డార్లింగ్ ప్రభాస్.. నువ్వు దేవుడివి సామీ.. అంటూ సినీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులపై ప్రభాస్ (Pan India Super Star Pabhas) మాటలకు ఫిదా అవుతున్నారు అతని అభిమానులు.
‘సీతారామం’ (Sita Ramam) సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు.