Prabhas Kriti Sanon ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా.. అంతకు మించిన స్థాయిలో ఈ సినిమాని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు.
నిజానికి, సంక్రాంతికే ఈ ‘ఆది పురుష్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి వుండాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేశారు.
ఇంతకీ, ‘ఆదిపురుష్’ ఎప్పుడొస్తుంది.? ఏమో, అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. అన్నట్టు, ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Prabhas Kriti Sanon మేడమ్ కృతి సనన్..
గతంలో ప్రభాస్ – అనుష్క మధ్య ఏదో వుందన్న పుకార్లు వినిపించాయి. ఆ పుకార్లు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్ళాడబోతున్నాడంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది.
ఇంతలోనే, కృతి సనన్ అయితే ప్రభాస్‌కి సరైన జోడీ అనీ, ఇద్దరూ త్వరలో పెళ్ళి పీటలెక్కుతారనీ మరో ఆసక్తికరమైన గాసిప్ షురూ అయ్యింది.
ప్రబాస్‌కి కృతి సనన్ లాంటి హైట్ వున్న అమ్మాయి అయితే బావుంటుంది భార్యగా.. అని ఓ సందర్భంలో సీనియర్ నటుడు, ప్రభాస్ తండ్రి.. దివంగత కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
ప్రభాస్ అంతలా ఇబ్బంది పడ్డాడెందుకు.?
తాజాగా ‘ఆహా’ అన్‌స్టాపబుల్ టాక్ షో సందర్భంగా, కృతి సనన్ ప్రస్తావన వచ్చింది. హోస్ట్ నందమూరి బాలకృష్ణ బాగా ఇబ్బంది పెట్టేశాడు ప్రభాస్‌ని.
Also Read: Kalpika Ganesh: ఆమెకి పెళ్ళయితే ఈమెకి ఎందుకీ మంట.?
‘మా మధ్య ఏమీ లేదని మేడమ్ చెప్పేసింది కదా..’ అంటూ ప్రభాస్ కృతి సనన్‌ని ఉద్దేశించి చెప్పాడు. దాంతో, ‘మేడమ్ కృతి సనన్’ అంటూ ప్రభాస్ మీద ర్యాగింగ్ షురూ అయ్యింది.
నిజమే, కృతి సనన్ ఎప్పుడో ఖండించేసింది ప్రభాస్‌తో ప్రేమ, పెళ్ళి గురించి. ఆయన కేవలం తనకు కో-స్టార్ మాత్రమేనని కృతి సనన్ కొన్నాళ్ళ క్రితమే స్పష్టతనిచ్చేసింది.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించాడు ‘1 నేనొక్కడినే’ సినిమాలో. ఆ తర్వాత కృతి సనన్ నాగచైతన్యతో ‘దోచెయ్’ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.