Prabhas Adipurush.. వద్దు ప్రభాస్.! ఆ తప్పు చేయొద్దు ప్లీజ్.! ఇలా వేడుకుంటున్నారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు.!
అసలేమయ్యింది.? అయినా, ఏమవ్వాలి.? ప్రభాస్ సినిమా వచ్చి ఎన్నాళ్ళయ్యింది.? అప్పుడెప్పుడో ‘రాధేశ్యామ్’ వచ్చింది.. అంతకు ముందు ‘సాహో’ వచ్చింది.
అభిమానులు మర్చిపోవాలనుకుంటున్న సినిమాలు ‘సాహో’, ‘రాధేశ్యామ్’. వాళ్ళకి గుర్తున్నవి ‘మిర్చి’, ‘బాహుబలి’ మాత్రమే.!
Prabhas Adipurush ‘ఆదిపురుష్’ ఎప్పుడు.?
సంక్రాంతికే ‘ఆదిపురుష్’ వచ్చెయ్యాలి. కానీ, అనివార్య కారణాల వల్ల అది కాస్తా ఆలస్యమయ్యింది. మళ్ళీ ఎప్పుడన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
‘సలార్’ వుంది, ‘ప్రాజెక్ట్ – కె’ వుంది.. వీటన్నటికీ మించి ‘మారుతి దర్శకత్వంలో సినిమా’ కూడా వుంది. అదే కదా, అభిమానుల భయం.!
మారుతి సినిమా వద్దే వద్దంటూ అభిమానులు నానా రకాల గోలా చేస్తున్నారు. కానీ, ప్రభాస్ తన పని తాను చేసుకుపోతున్నాడు.
ముందే మారుతి సినిమా వచ్చేస్తే.?
ఒకవేళ మారుతి సినిమా వస్తే, అది ఫ్లాప్ అయితే.. అభిమానుల కంట రక్త కన్నీరే.! అందుకే, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Dhamaka OTT Review.. తిట్టిపోస్తున్నారేంటబ్బా.!
అయితే, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదట. ఇప్పుడప్పుడే ప్రభాస్ – మారుతి సినిమా రాబోదట. నమ్మొచ్చా.?
ఏమో, మారుతి సినిమా వేగంగా తీసేస్తాడు. సో, సినిమా రెడీ అయిపోతే.. ‘ఆదిపురుష్’ వెనక్కి వెళితే.. అంతే సంగతులు.
కానీ, ఓ సినిమా విషయంలో.. ఆ సినిమా హీరో అభిమానులు ఇంతలా ఆందోళన చెందడమనేది ఇంతకు ముందెన్నడూ జరగలేదేమో.! ఫాఫం మారుతి.. ఫాఫం ప్రభాస్.. ఫాఫం డార్లింగ్స్.!