Prabhas Adipurush Sriram.. ఆరడుగుల ఆజానుబాహుడు, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, అందగాడు, అద్భుతమైన స్టార్‌డమ్ వున్నోడు, ప్యాన్ ఇండియా హీరో బాహుబలి ప్రబాస్.
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన నటుడిగా ‘బాహుబలి’తో ప్రబాస్ తనదైన ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా ప్రబాస్ స్టార్‌డమ్ తగ్గేదేలే అంటోంది.
ఆ ప్రబాస్ స్టార్‌డమ్‌ని నాశనం చేయడానికే ‘ఆదిపురుష్’ సినిమాని ఓం రౌత్ ప్లాన్ చేసినట్లున్నాడు. ఇప్పటి వరకూ ‘ఆదిపురుష్’ నుంచి వచ్చిన ఏ ఫోటో, ఏ వీడియో ప్రోమో కూడా అంచనాల్ని అందుకోలేదు.
Prabhas Adipurush Sriram.. శ్రీరాముడి గెటప్ సూటవ్వని నటుడా.?
పై పెచ్చు ప్రబాస్‌నీ, ప్రబాస్ ఇమేజ్‌నీ నాశనం చేయడం కోసమే అన్నట్లు ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు. వెండితెరపై అది ఏ భాషలో అయినా కావచ్చు.. శ్రీరాముడి గెటప్ సూటవ్వని నటుడు లేడంటే అతిశయోక్తి కాదు.
శ్రీరాముడంటే ఎలా వుండాలి.?
సీతమ్మ తల్లి ఎలా వుండాలి.?
లక్ష్మణుడెలా వుండాలి.?
ఆంజనేయుడెలా వుండాలి.?
ఎలా వుండాలి.? అని కాదు, ఎలా వుండకూడదు.?
ఔను, ఎలా వుండకూడదో చూపించాలనుకుంటున్నట్టున్నారు.!
ఇంతకీ, ఎవరి మీద పగబట్టారు.? ఓం రౌత్.? ఏంటీ పైత్యం.?
Mudra369
సీత పాత్ర విషయంలో అయినా అంతే. హనుమంతుడి సంగతి సరే సరి. ఆయా పాత్రల్లో దైవత్వం ఉట్టిపడేలా డిజైన్ చేస్తారు. ‘ఆది పురుష్’ విషయానికి వస్తే, ప్రతీ పాత్ర అభ్యంతరకరంగానే కనిపిస్తోంది.
‘శ్రీరామ నవమి’ సందర్భంగా ‘ఆది పురుష్’ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీరాముడి గెటప్‌లో ప్రబాస్, సీత గెటప్‌లో కృతి సనన్ ఇద్దరూ తేలిపోయారు. లక్ష్మణుడి పాత్ర గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఆంజనేయుడూ అంతే.
ఇక ఆపెయ్యండి మహాప్రభో..
వద్దు బాబోయ్.. ఇక్కడితో ఈ వేధింపులు ఆపేయండి. ఇకపై ఒక్క ఫోటో కూడా ‘ఆది పురుష్’ నుంచి రిలీజ్ చేయొద్దు.. అని అభిమానులే నెత్తీ నోరు బాదుకునే పరిస్థితి వచ్చింది.
Also Read: వద్దు బాబోయ్.! త్రివిక్రమ్‌కి మహేష్ ఫ్యాన్స్ వార్నింగ్.!
కోట్ల రూపాయల బడ్జెట్ బుగ్గి పాలు అయిపోయేలా కనిపిస్తోంది. ఎందుకొచ్చిన గ్రాఫిక్స్..!
తేజోమూర్తిలా కనిపించే ప్రబాస్‌కి తేజోవంతమైన రాముడి గెటప్ సరిగ్గా వేయలేకపోయారంటే.. ఇంక సినిమా ఏం తీసి ఛస్తారు.? ఇదీ ప్రబాస్ అభిమానుల సూటి ప్రశ్న.