Prabhas Hanu Fauzi Leak.. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ‘ఫౌజీ’ టైటిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. మైత్రీ మూవీ మేకర్స్, ‘టీ-సిరీస్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం, సీనియర్ నటులు జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం.
ఈ సినిమాతో ఇమాన్వీ, తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమవుతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ‘ఫౌజీ’ విడుదల కానుంది.
Prabhas Hanu Fauzi Leak.. ఫౌజీ అంటే..
‘ఎ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్’ అంటూ ఓ ట్యాగ్ వదిలింది చిత్ర యూనిట్, ‘ఫౌజీ’ గురించి.
పద్మవ్యూహం గెలిచిన పార్థుడు.. పాండవ పక్షం నిలిచిన కర్ణుడు.. గురువే లేని ఏకలవ్యుడు.. పుట్టుకతోనే వీడొక యోధుడు.. అంటూ, ‘ఫౌజీ’లో ప్రభాస్ పాత్ర గురించి పేర్కొన్నారు.
ఇవన్నీ తర్వాత, అసలు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ని ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేయాలన్న ప్లాన్, ఈ క్రమంలో టైటిల్ ముందే లీకైపోవడం.. వీటిని ఎలా చూడాలి.?
Also Read: రష్మిక, విజయ్.. ఇంత రహస్యమెందుకు.?
నిజానికి, హను – ప్రభాస్ కాంబినేషన్లో సినిమా.. అన్న ప్రకటన రాకముందే, టైటిల్ ‘ఫౌజీ’ అంటూ, గాసిప్పులు గుప్పుమన్నాయ్.
వాటిని గాసిప్పులు అనాలా.? లీకులు.. అనాలా.? ఎవరన్నా ఏమన్నా అనుకోండి.. సినిమా టైటిల్ అయితే ముందే రివీల్ అయిపోయింది.
కాకపోతే, అధికారికంగా ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ అనే టైటిల్‌ని ఓ పోస్టర్‌తో రివీల్ చేశారంతే.!
