Prabhas Kalki OTT Release.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటానీ.. ఇలా ప్రముఖ తారాగణం ఈ అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్నారు.
పాన్ ఇండియా కాదు.. ఈసారి పాన్ వరల్డ్ అంటున్నారు ప్రభాస్ అభిమానులు ‘కల్కి’ సినిమాకి సంబంధించి.
వాస్తవానికి, ప్రభాస్ గత సినిమాలు వరుసగా నిరాశపరుస్తూ వస్తున్నాయి. వాటిల్లో ‘సలార్’ కాస్త బెటర్. ప్రభాస్ స్టామినాకి, ‘సలార్’ ఇంకా పెద్ద విజయం సాధించి వుండాల్సింది.
Prabhas Kalki OTT Release.. ఓటీటీ రచ్చ.. అప్పుడే షురూ అయ్యిందహో.!
అసలు విషయానికొస్తే, ‘కల్కి’ సినిమాకి సంబంధించి ‘ఓటీటీ రచ్చ’ అప్పుడే షురూ అయ్యింది. హిందీ వెర్షన్ ఫలానా ఓటీటీ వేదిక మీద, రీజినల్ లాంగ్వేజెస్ ఫలానా వేదికపైన.. అంటూ లీకులు బయటకు వస్తున్నాయ్.
ఏదన్నా సినిమా తెరకెక్కుతోందంటే, ముందుగా ఓటీటీ డీల్స్ ఖరారయిపోతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అక్కడే అసలు కథ మొదలవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ ‘కల్కి’ స్ట్రీమింగ్ అవబోతోందిట.. రీజినల్ లాంగ్వేజెస్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని తెలుస్తోంది.
Mudra369
సినిమా బడ్జెట్ తదితర అంశాల్ని సైతం, ఓటీటీ సంస్థలు నిర్దేశించే పరిస్థితులు దాపురించేశాయి. రిలీజ్ డేట్ అయితే, ఓటీటీ సంస్థ కనుసన్నల్లోనే జరిగి తీరాలి.
ఇదీ ఇప్పుడున్న పరిస్థితి. ఈ కారణంగా క్వాలిటీ పెరుగుతోందా.? క్వాలిటీ తగ్గుతోందా.? ఏమోగానీ, థియేటర్లకు ప్రేక్షకులు రావడం అయితే తగ్గిపోయిందన్నది నిర్వివాదాంశం.
ఫలానా ఓటీటీలో ఫలానా సినిమా.. అని ముందే వార్తలొచ్చేస్తే, ఆటోమేటిక్‌గా థియేటర్లలో సినిమా చూడాలన్న ఆసక్తి చచ్చిపోతుంటుంది.
థియేటర్లలో సినిమా చూడాలంటే.. ప్చ్..
చెప్పిన డేట్‌కి సినిమాలు రావడంలేదు.! దాంతో, ఎలాగోలా సినిమా రిలీజ్ అయినా, సర్లే.. ఇంకో నెల రోజులు సినిమా ఆలస్యమయ్యిందనుకుందాం.. అని ఓ సెక్షన్ ఆడియన్స్, ఓటీటీలో వచ్చేవరకు వేచి చూస్తున్నారు.
అలా థియేట్రికల్ రిలీజ్ అనే పద్ధతి దారుణంగా దెబ్బ తింటోంది. థియేటర్లు వెలవెలబోతున్నాయ్. తొలి రోజు ఫ్లాప్ టాక్ వచ్చిందా.. ఇక అంతే సంగతులు. ఓటీటీలోనూ చూసేవాడుంటంలేదు.
Also Read: కన్నింగ్ స్టార్ అల్లు అర్జున్: జనసేనానికి వెన్నుపోటు.?
ప్రభాస్ లాంటి హీరోకి అయినా ఇదే సమస్య.! ఏ హీరో అయినా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాడిప్పుడు.
ఓటీటీ డీల్స్ గురించి అభిమానుల్లో ఆసక్తి వుండడం సహజమే. కానీ, ఓటీటీలో వచ్చేస్తుందన్న ప్రచారం, థియేటర్లలో సినిమా చూడటంపై తీవ్ర ప్రభావం చూపుతోంది ప్రేక్షకుల్లో.