Prabhas Kriti Sanon Engagement.. ‘ఆదిపురుష్’ జంట ప్రభాస్ – కృతి సనన్ వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారా.? గత కొంతకాలంగా ఇదే రచ్చ కొనసాగుతోంది.
మొన్నటికి మొన్న ‘అన్‌స్టాపబుల్ వేదికపై’ హోస్ట్ నందమూరి బాలకృష్ణ కూడా ప్రభాస్‌ని తెగ ఇబ్బంది పెట్టేశాడు ఈ విషయమై.!
‘ఛ.. అలాంటిదేం లేదు..’ అంటూ ప్రభాస్ తేల్చేశాడు. అయినాగానీ, అదిగో పెళ్ళి.. ఇదిగో ఎంగేజ్మెంట్.. అంటూ ఈ జంట గురించి గాసిప్స్ వస్తూనే వున్నాయ్.!
Prabhas Kriti Sanon Engagement.. మాల్దీవుల్లో ఎంగేజ్మెంట్..
తాజా గాసిప్ ఏంటంటే, ప్రభాస్ – కృతి సనన్ ఎంగేజ్మెంట్‌కి మాల్దీవ్స్ వేదిక కానుందని. ఈ విషయమై ఇటు ప్రభాస్, అటు కృతి సనన్.. ఇద్దరూ పెదవి విప్పలేదు.
కృతి సనన్ తన సినిమాల ప్రమోషన్లలో బిజీగా వుంది. ప్రభాస్ సంగతి సరే సరి. గతంలో ప్రభాస్ – అనుష్క మధ్య ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా విన్నాం.

అనుష్క – ప్రభాస్ మధ్య అలాంటిదేం లేదనీ.. ఇద్దరూ మంచి స్నేహితులనీ క్లారిటీ వచ్చేసినా.. తరచూ ఆ పాత గాసిప్స్ మళ్ళీ తిరగతోడుతుంటారు కొందరు.
ఖండించేయొచ్చు కదా కృతీ..
ఎన్నిసార్లని ఖండిస్తాం.? అంటోంది కృతి సనన్.. ప్రభాస్‌తో పెళ్ళి పుకార్లకు సంబంధించి. ఇంకోసారి ఖండిస్తే వచ్చే నష్టమేంటో ఆమెకే తెలియాలన్నది కొందరి వాదన.
Also Read: Urfi Javed: అందం అరిగిపోద్దా.? తరిగిపోద్దా.?
‘పెళ్ళంటూ కుదిరితే ఖచ్చితంగా చెప్తా.. అది రహస్యమేమీ కాదు..’ అంటున్నాడు ప్రభాస్. అద్గదీ అసలు సంగతి.